close

తాజా వార్తలు

ఏం జరుగుతోంది?..ఎవరు బలవుతున్నారు?

శ్రీలంక పేలుళ్లను ఖండించిన క్రీడా ప్రముఖులు

కొలంబో: శ్రీలంకలో జరిగిన మారణకాండను యావత్‌ క్రీడాలోకం ఖండించింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సామాజిక మాధ్యమాల వేదికగా పలువురు సంతాపం తెలిపారు.
* ‘శ్రీలంకలో వివిధ ప్రదేశాల్లో దాడులు జరిగాయని తెలిసి ఎంతో బాధేసింది. అందరూ ఏకమై ఈ ఘటనను ఖండించాలి. హింసవాదానికింక స్వస్తి పలకాలి’ - సచిన్‌ తెందుల్కర్‌.
*‘శ్రీలంకలో ఇలాంటి ఘటన జరిగిందని తెలిసి షాకయ్యాను. ఈ భయానక దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం’ -టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ.
*‘ అందమైన దేశంలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం. ప్రాణాలు కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి’ - రోహిత్‌ శర్మ
*‘ గుండె పగిలినంత బాధగా ఉంది. మన పొరుగు దేశంలో ఇలాంటి దుర్ఘటన జరగడం దారుణం. నిందితులను కఠినంగా శిక్షించాలి’- శిఖర్‌ ధావన్‌.
* ‘ ప్రపంచ వ్యాప్తంగా ఏం జరుగుతోంది. ఆ దేవుడు అందర్నీ కాపాడాలి’ - సానియా మీర్జా
* ‘శ్రీలంకలో భయానక దాడి గురించి విని చాలా బాధ పడ్డాను. కష్ట సమయంలో ఉన్న ఆ దేశ ప్రజలకు ప్రగాఢ సానుభూతి. గాయపడిన వాళ్లందరూ త్వరగా కోలుకోవాలి’ -వీవీఎస్‌ లక్ష్మణ్‌.
*‘  శ్రీలంకలో దాడి జరిగిందని విని చాల బాధ పడ్డాను. వారంతా ఈ బాధ నుంచి త్వరగా కోలుకోవాలి’ -దీపక్‌ చాహర్‌
*‘ శ్రీలంక నుంచి ఇలాంటి వార్త వినడానికి ఎంతో బాధగా ఉంది. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. గాయ పడిన వారు త్వరగా కోలుకోవాలి’ - వృద్ధిమాన్‌ సాహ.
* ‘ ఈస్టర్‌ రోజున శ్రీలంకలో జరిగిన ఈ దాడిలో బాధితులైన ప్రతి ఒక్కరూ ఎంతో బాధ అనుభవిస్తుంటారు. ఇలాంటి ఘటనల్లో ఎవరు బలవుతున్నారు? అమాయకులే. ఒక అందమైన దేశంలో ఇలాంటి అలజడి రేగడం దారుణం.  ఈ బాధనుంచి వారంతా త్వరగా కోలుకోవాలి’ - టామ్‌ మూడీ.
* ‘మాకిది చాలా బాధాకరమైన రోజు. పదేళ్ల పాటు శాంతియుతంగా ఉన్న ఈ దేశంలో మరోసారి దాడులు జరిగాయి. ఈ ఘటన ప్రాణాలు కోల్పోయిన వారికి నా సానుభూతి. ఈ ఘటనను ఖండిస్తున్నాను. అందరూ ఏకమవ్వాల్సిన సమయమిది’ - మహేలా జయవర్ధనే(శ్రీలంక క్రికెటర్).
 వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సైతం ఈఘటనను ఖండిస్తున్నారు. ఈస్టర్‌ సండే సందర్భంగా ప్రజలు అధిక సంఖ్యలో చర్చిలకు రాగా.. వీళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 166 మంది ప్రాణాలు కోల్పోయారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.