close

తాజా వార్తలు

పేలుడు సంభవించిందిలా!

కొలంబో: శ్రీలంకలో ఈస్టర్‌ నాడు జరిగిన దారుణ కాండలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు ఎనిమిది చోట్ల బాంబు దాడులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు కోచికడేలో సెయింట్ ఆంటోనీ చర్చిలో చోటు చేసుకున్న పేలుడు ఘటనను కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. డాష్‌ కెమెరా తీసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. 

మరోవైపు ఈ ఘటనను దేశ విదేశాలకు చెందిన నాయకులు, ప్రముఖులు ఖండిస్తున్నారు. ఈ మేరకు శ్రీలంకలో అత్యవసర కేబినెట్‌ సమావేశం ఏర్పాటు చేశారు. రెండు చోట్ల ఆత్మాహుతి దాడులు, నాలుగు చోట్ల  బాంబు పేలుళ్లు చోటు చేసుకోవడంతో ఈ ఘటనల వెనక ఐసిస్‌ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలో ఇప్పటికి 200 మందికి పైగా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.