Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 88166
            [news_title_telugu_html] => 

కోహ్లీసేన.. సెమీస్‌ పక్కా

[news_title_telugu] => కోహ్లీసేన.. సెమీస్‌ పక్కా [news_title_english] => Vaas predicts India will enter semis in the World Cup [news_short_description] => ప్రపంచకప్‌నకు ఎంపిక చేసిన టీమిండియా సమతూకంతో ఉందని శ్రీలంక మాజీ క్రికెటర్‌ చమిందా వాస్‌ అన్నాడు. కోహ్లీసేన సెమీస్‌ చేరుతుందని జోస్యం చెప్పాడు. ఇంగ్లాండ్‌లో జరిగే... [news_tags_keywords] => team india,virat kohli,chaminda vas [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-04-24 00:13:39 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కోహ్లీసేన.. సెమీస్‌ పక్కా - Vaas predicts India will enter semis in the World Cup - EENADU
close

తాజా వార్తలు

కోహ్లీసేన.. సెమీస్‌ పక్కా

ముంబయి: ప్రపంచకప్‌నకు ఎంపిక చేసిన టీమిండియా సమతూకంతో ఉందని శ్రీలంక మాజీ క్రికెటర్‌ చమిందా వాస్‌ అన్నాడు. కోహ్లీసేన సెమీస్‌ చేరుతుందని జోస్యం చెప్పాడు. ఇంగ్లాండ్‌లో జరిగే మెగా టోర్నీలో తమ దేశమూ మెరుపులు మెరిపించగలదని ఆశాభావం వ్యక్తం చేశాడు. సీనియర్‌ పేసర్‌ లసిత్‌ మలింగ జట్టుకు అత్యంత కీలమని వెల్లడించాడు.

‘మూడు నాలుగేళ్లుగా భారత క్రికెట్‌ ఆధిపత్యం నడుస్తోంది. వారికి మంచి బ్యాకప్‌ బౌలర్లు ఉన్నారు. చక్కగా ఆడతారు. ప్రపంచకప్‌లో టీమిండియా కచ్చితంగా సెమీస్‌ చేరుతుందని నా అంచనా’ అని వాస్‌ అన్నాడు. ముంబయిలో జరిగిన స్థానిక టీ20 టోర్నీ ప్రారంభ వేడుకలో అతడు రంగనా హెరాత్‌తో కలిసి పాల్గొన్నాడు. ప్రపంచకప్‌లో భారత స్పిన్నర్లు రాణిస్తాడని హెరాత్‌ వెల్లడించాడు.

‘యుజువేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ అద్భుతంగా ఆడుతున్నారు. అందుకే సెలక్టర్లు కుడిచేతి వాటం లెగ్‌ స్పిన్నర్‌, చైనామన్‌ బౌలర్‌, మరో (జడేజా) స్పిన్నర్‌ను ఎంపిక చేశారు. ప్రపంచకప్‌లో వీరంతా అద్భుతంగా రాణించగలరు. వీరు అదనపు పరుగులు ఇవ్వొచ్చు కానీ వికెట్లు తీస్తారు. ఇంగ్లాండ్‌ పిచ్‌లు టోర్నీ మధ్యలో పొడిగా మారి స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయి. అప్పుడు వీరంతా రెచ్చిపోతారు. శ్రీలంక కూర్పు సరికొత్తగా ఉంది. కొత్త సారథి వచ్చాడు. అతడికి మేమంతా అండగా ఉంటాం. మలింగ అత్యంత కీలకం అవుతాడు. వెంటవెంటనే అతడు ముంబయి ఇండియన్స్‌కు, లంకలో దేశవాళీ క్రికెట్‌ ఆడటం అతడికున్న అంకితభావాన్ని తెలియజేస్తోంది’ అని హెరాత్‌ అన్నాడు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.