close

తాజా వార్తలు

‘ఈ ఇంట్లో ఓ హత్య జరిగింది’

‘శివరంజని’ ట్రైలర్‌ విడుదల

హైదరాబాద్‌: ప్రముఖ యాంకర్‌, నటి రష్మీ గౌతమ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శివరంజని’. నాగ ప్రభాకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్‌ ఈ చిత్ర ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. ‘ఈ ఇంట్లో ఓ హత్య జరిగింది. కానీ చంపింది నేను కాదు. నువ్వు..’ అంటూ ఓ పోలీసు అధికారి నందుతో చెబుతున్న డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. ఇందులో రష్మిని ఓ దెయ్యం వెంటాడుతుంటుంది. ఈ నేపథ్యంలో రష్మి తన గతాన్ని మర్చిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఎవరా దెయ్యం? అన్నదే కథ. ట్రైలర్‌లో ధన్‌రాజ్‌ కామెడీ  ఆకట్టుకుంటోంది. శేఖర్‌ చంద్ర ఈ చిత్రానికి సంగీతం అందించారు. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.