Covid మూలాలపై పూర్తి దర్యాప్తు జరగాలి
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Covid మూలాలపై పూర్తి దర్యాప్తు జరగాలి

చైనాలోని ల్యాబ్‌ నుంచి వైరస్‌ లీకై ఉండొచ్చన్న వాదనపైనా దృష్టి సారించాలి
 అమెరికా, బ్రిటన్‌ శాస్త్రవేత్తల డిమాండ్‌ 

లండన్‌: కొవిడ్‌-19 మూలాలను తేల్చడానికి మరింత పరిశోధన జరపాలని అమెరికా, బ్రిటన్‌ శాస్త్రవేత్తలు డిమాండ్‌ చేశారు. చైనాలోని వుహాన్‌ వైరాలజీ ల్యాబ్‌ నుంచి ఈ వైరస్‌ ప్రమాదవశాత్తు విడుదలై ఉంటుందన్న వాదనపైనా దృష్టి సారించాలని కోరారు. ఈ శాస్త్రవేత్తల్లో భారత సంతతికి చెందిన ఇమ్యునాలజీ, అంటువ్యాధుల నిపుణుడు రవీంద్ర గుప్తా కూడా ఉన్నారు. పూర్తిస్థాయి డేటా లభ్యమయ్యేవరకూ ఈ వైరస్‌.. ల్యాబ్‌ నుంచి వెలువడిందన్న వాదనతోపాటు అది సహజసిద్ధంగా వచ్చి ఉంటుందన్న వాదననూ పరిగణనలోకి తీసుకోవాలని శాస్త్రవేత్తలు కోరారు. ఈ మేరకు వారు రాసిన లేఖ ‘సైన్స్‌’ జర్నల్‌లో ప్రచురితమైంది. కరోనా మూలాలపై స్పష్టత అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్, అమెరికా, 13 దేశాలు, యూరోపియన్‌ యూనియన్‌ వ్యక్తంచేసిన అభిప్రాయంతో తాము ఏకీభవిస్తున్నట్లు వారు చెప్పారు. ఈ వైరస్‌ మూలాలను గుర్తించేందుకు చైనా-డబ్ల్యూహెచ్‌వో ఉమ్మడి అధ్యయన బృందం ఏర్పడిందని తెలిపారు. ‘‘ఈ అధ్యయనానికి సంబంధించిన మొదటి దశలో సమాచారం, డేటా, నమూనాలను.. ఈ బృందంలోని చైనా సభ్యులు సేకరించారు. దీని ఆధారంగా మిగతా బృందం విశ్లేషణ చేసింది. కరోనా వైరస్‌ సహజసిద్ధంగా వచ్చిందా లేక ల్యాబ్‌ నుంచి లీకైందా అన్నదానిపై ఇతమిత్థంగా ఏమీ తేలలేదు. ఒక జంతువు నుంచి ఈ వైరస్‌ వచ్చి ఉండటానికే ఆస్కారం ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. ల్యాబ్‌ ద్వారా లీకై ఉండటానికి అవకాశం దాదాపుగా లేదని తెలిపింది. నిజానికి ఈ రెండు సిద్ధాంతాలపై సరైన పరిశీలన జరగలేదు’’ అని పేర్కొన్నారు. ల్యాబ్‌ నుంచి లీకై ఉంటుందన్న వాదనకు మద్దతునిచ్చే ఆధారాలపై సరైన అధ్యయనం జరగలేదని, ఈ కోణాన్ని బలపరిచే అదనపు వనరులను అందించడానికి తాము సిద్ధమన్న డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ వ్యాఖ్యలను వారు గుర్తుచేశారు. పారదర్శకత, నిష్పక్షపాత, డేటా, అన్ని రంగాల నిపుణులతో కూడిన దర్యాప్తు అవసరమన్నారు. 


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు