close

ప్రధానాంశాలు

నాడు ఏపీ నం. 1

2018-19లో అత్యధిక ప్రైవేటు పెట్టుబడులు రాష్ట్రానికే
తెలంగాణకు నాలుగోస్థానం

ఈనాడు, దిల్లీ: బ్యాంకులు, ఆర్థిక సంస్థలు 2018-19లో మంజూరు చేసిన మొత్తం ప్రాజెక్టుల్లో అత్యధిక పెట్టుబడులను దక్కించుకున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. తెలంగాణ నాలుగోస్థానంలో నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో 11.8 శాతం పెట్టుబడులను ఆకర్షించి.. సంబంధిత జాబితాలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. అయిదేళ్లలో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు మంజూరు చేసిన ప్రాజెక్టుల్లో ఏపీ 10% వాటా దక్కించుకొని మూడో స్థానంలో నిలిచింది. 2014-15 నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరాల మధ్యలో దేశవ్యాప్తంగా రూ.7,03,103 కోట్ల విలువైన 2,112 ప్రాజెక్టులు మంజూరయ్యాయి. అందులో రూ.70 వేల కోట్ల విలువైన పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినట్లు రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ఈ నెల బులిటెన్‌లో వెల్లడించింది. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ 10%తో మూడో స్థానాన్ని ఆక్రమించడం విశేషం.  2017-18లో మంజూరయిన మొత్తం పెట్టుబడుల్లో ఏపీకి 9.9% వాటా రాగా మరుసటి ఏడాది 11.8%కి పెరిగింది. ఇదే సమయంలో తెలంగాణ వాటా 1.9% నుంచి 8.2%కి చేరింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.