close

ప్రధానాంశాలు

బీమా చేయించాడు.. చంపేశాడు

బీమా సొమ్ము కోసం వాహనంతో ఢీకొట్టి బాబాయి హత్య
మిస్టరీని ఛేదించిన పోలీసులు
మునగాల - న్యూస్‌టుడే

డుగంటుతున్న మానవ సంబంధాలకు నిలువెత్తు నిదర్శనం ఈ ఘటన. అన్న కుమారుడే కాలయముడిగా మారాడు. పథకం ప్రకారం రూ.50 లక్షల బీమా చేయించి అనంతరం వాహనంతో ఢీకొట్టి చంపేశాడు. ప్రమాదంగా చిత్రీకరించాడు. బీమా విషయంలో పోలీసులకు అనుమానం వచ్చి లోతుగా విచారించినప్పుడు అసలు నిజం బయటపడింది. సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో ఈ ఘటన వెలుగుచూసింది. తాడ్వాయి గ్రామానికి చెందిన ముంజల వెంకటేశ్వర్లు తండ్రి... ముంజల సైదులు(30) తండ్రి వరుసకు అన్నదమ్ములు. వెకంటేశ్వర్లు కొడుకు రమేశ్‌ బాబాయి వరసైన సైదులును మట్టుపెట్టాడు. సైదులుకు తల్లిదండ్రులు లేరు. భార్య ఎప్పుడో వదిలేసింది. లారీలపై క్లీనర్‌గా ఉండేవాడు.

జల్సాలతో రమేశ్‌ అప్పుల పాలు...
రమేశ్‌ లారీ డ్రైవర్‌. లాభాలు వస్తుండటంతో గతంలో సొంతంగా నాలుగు లారీలను కొన్నాడు. జల్సాలకు బానిసై లారీలను సక్రమంగా నిర్వహించకపోవడంతో నష్టాలతో అప్పుల పాలయ్యాడు. కిస్తీలను కట్టకపోవడంతో ఫైనాన్స్‌ వారు లారీలను తీసుకెళ్లిపోయారు. ఈ పరిస్థితుల్లో వరుసకు బాబాయి అయిన సైదులు పేరిట మూడు నెలల క్రితం రెండు లారీలు కొన్నాడు. వాటితోనూ నష్టాలు రావడంతో కిస్తీలు కట్టలేకపోయాడు. దీంతో ఫైనాన్స్‌ వారు మళ్లీ లారీలను తీసుకెళ్లారు. అప్పు ఇచ్చిన వారు రమేశ్‌ను డబ్బులు చెల్లించాలని కోరారు. నా అనే వారు లేని సైదులు పేరిట రూ.50 లక్షల బీమా చేయించి ప్రమాదంలో అతడ్ని చంపి, వచ్చిన సొమ్ముతో అప్పులు తీర్చాలని పథకం పన్నాడు.

సైదులుపై భారీ మొత్తం బీమా కట్టి ఉండటంతో...
పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి చనిపోయినట్టుగా కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం రమేశ్‌ తండ్రి వెంకటేశ్వర్లు... చనిపోయిన వ్యక్తి వరసకు తనకు తమ్ముడని ధ్రువీకరించారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ద]ర్యాప్తు చేశారు. మృతుడు లేబైపై మృతిచెంది ఉండడం, అతని పేరుతో భారీ మొత్తంలో బీమా కట్టి ఉండటంతో అనుమానం వచ్చిన పోలీసులు పలు కోణాల్లో విచారించారు. వారి విచారణలో మృతుడిది హత్యగా తేలడంతో నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు సీఐ శివశంకర్‌ గౌడ్‌ తెలిపారు.

స్నేహితులతో కలిసి హత్యకు పన్నాగం
రమేశ్‌ తన స్నేహితులు గంధం మహేశ్‌, మాతంగి శోభన్‌బాబుకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఇస్తానని చెప్పి సైదులు హత్యకు పథకం వేశాడు. అతడిపై బీమా చేయించి నామినీగా తన తల్లి పేరు పెట్టాడు. అనుకున్న పథకాన్ని అమలు చేయడానికి ఒకసారి మునగాల శివారులోని పెట్రోల్‌ బంక్‌ వద్ద ప్రయత్నించి విఫలమయ్యారు. తిరిగి జనవరి 24న రాత్రి సైదులుతో కలిసి నిందితులు మద్యం తాగారు. ఇందిరానగర్‌ వద్దనున్న ట్రక్‌ లేబై వద్దకు వాహనంలో తీసుకెళ్లారు. సమీపంలో ఆగి ఉన్న లారీలోని జాకీ తీసుకురావాలని సూచించారు. సైదులు జాకీ తీసుకురావడానికి వెళ్తుండగా వారు వచ్చిన వాహనంతోనే ఢీకొట్టి హత్యచేశారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.