close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మహమ్మారిపై పోరుకు రూ.1,125 కోట్లు

ప్రకటించిన అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్‌, విప్రో

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: కొవిడ్‌-19 విజృంభణ కారణంగా భారత్‌లో నెలకొన్న అసాధారణ ఆరోగ్య, మానవ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు విప్రో లిమిటెడ్‌, విప్రో ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌, అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ల తరఫున రూ.1,125 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం విప్రో ప్రకటించింది. ఈ  మొత్తంలో అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ రూ.1000 కోట్లు, విప్రో లిమిటెడ్‌ రూ.100 కోట్లు, విప్రో ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ రూ.25 కోట్లు సమకూర్చుతాయని విప్రో, అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌లు బుధవారం ఓ ఉమ్మడి ప్రకటనలో తెలిపాయి. సంస్థ ఏటా కేటాయించే సీఎస్‌ఆర్‌ నిధులు, ఇతర దాతృత్వ కార్యక్రమాలకు ఇవి అదనం అని స్పష్టం చేశాయి. కరోనా వైరస్‌పై భారత్‌ చేస్తున్న పోరుకు ఈ నిధుల ద్వారా మద్దతు లభిస్తుందని భావిస్తున్నట్లు విప్రో అభిప్రాయపడింది. ముఖ్యంగా ఈ కష్టకాలంలో వెనుకబడిన వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. పరిస్థితులు దయనీయంగా ఉన్న ప్రాంతాల్లో వైద్యారోగ్య పరిస్థితుల్ని మెరుగుపరిచేందుకు సమగ్ర చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.