close

ప్రధానాంశాలు

24 గంటలు.. 6,654 కేసులు

కరోనాలో ఇప్పటివరకు ఇదే రోజువారీ గరిష్ఠం
44 రోజుల తర్వాత తగ్గిన మరణాల శాతం

ఈనాడు, దిల్లీ: దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. శుక్ర-శనివారాల మధ్య 6654 కేసులు వెలుగు చూడగా, 137 మంది కన్నుమూశారు. నిమిషానికి సగటున 4.62 మంది చొప్పున కరోనా బారిన పడినట్లయింది. కరోనా వెలుగులోకి వచ్చాక 24 గంటల్లో ఇన్ని కేసులు రావడం ఇదే మొదటిసారి. దాదాపు 44 రోజుల తర్వాత మరణాల శాతం మూడు కంటే తక్కువకి చేరడమే కాస్త ఊరట. మొత్తం బాధితుల్లో మరణించిన వారి శాతం 2.97కి తగ్గింది. ఏప్రిల్‌ 9 (2.88%) తర్వాత ఇదే అతి తక్కువ. కోలుకున్నవారి సంఖ్య ఇదివరకెన్నడూ లేనంత గరిష్ఠ స్థాయిలో 41.39%కి చేరింది. కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నప్పటికీ ఈ రెండూ కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి. గత నెల 19 తర్వాత ఏ రోజూ రెండంకెల వృద్ధి నమోదు కాలేదు.

మరణాలు, కేసులు మహారాష్ట్రలోనే అధికం
నెల రోజుల్లో రోజువారీ కేసుల వృద్ధిలో ఈ నెల 5న గరిష్ఠంగా 9.04% నమోదు కాగా, 13న 4.98% కనిపించింది. 24 గంటల్లో మహారాష్ట్ర, గుజరాత్‌, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌లలో రెండంకెల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఒకరోజు వ్యవధిలో సంభవించిన మొత్తం మరణాల్లో 46%, కొత్త కేసుల్లో 44% మహారాష్ట్ర నుంచే నమోదయ్యాయి. మరో 9 రాష్ట్రాల్లో 100 నుంచి 800 వరకు కేసులు నమోదయ్యాయి.
* దక్షిణాదిలో తమిళనాడు తర్వాత కర్ణాటకలో అత్యధిక రోజువారీ కేసులు కనిపిస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో.. అసోంలో అత్యధికంగా ఒకేరోజు 56 కేసులొచ్చాయి. ఒకదశలో సున్నాకి తగ్గిన గోవాలో ఇప్పుడు 54 కేసులున్నాయి. కేరళలో 24 గంటల్లో 42 కేసులొచ్చాయి. అక్కడ కేసులు 732కి పెరిగాయి. ప్రాణనష్టం నాలుగుకు (0.54%) పరిమితమయింది.
* ఈశాన్య రాష్ట్రాల్లో అసోం, మేఘాలయల్లో మినహా ఎక్కడా ప్రాణనష్టం లేదు.

వలసతో ముడిపడిన ఉద్ధృతి
వలస కార్మికుల తాకిడి ఎక్కువగా ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ కేసుల ఉద్ధృతి పెరుగుతోంది. బిహార్‌ ఇప్పుడు కొవిడ్‌ కేసుల్లో తొలి 10 రాష్ట్రాల జాబితాలో చేరింది. ఇంతవరకు 10వ స్థానంలో పంజాబ్‌ ఉండేది. 195 కొత్త కేసులతో శనివారం నాటికి బిహార్‌లో కేసుల సంఖ్య 2,177 అయింది. దీంతో పదో స్థానానికి వచ్చింది. వలస కూలీల తాకిడి పెరిగాక గత కొన్నిరోజులుగా అక్కడ రోజుకు వందకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాలు 11 (0.50%)కి పరిమితం కావడం కొంత ఊరట.
*  ప్రాణనష్టం రేటులో ఇప్పటికీ పశ్చిమ బెంగాల్‌ (7.95%), గుజరాత్‌ (6.04%) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
*  దేశంలో మొత్తం మృతుల్లో మహారాష్ట్రవారే 40.77% మంది. అక్కడ మొత్తం కేసుల్లో ప్రాణ నష్టం 3.40%.
*  గత 24 గంటల్లో ఎన్నడూ లేనంత గరిష్ఠ సంఖ్యలో దేశంలో పరీక్షలు నిర్వహించారు. మొత్తం పరీక్షల్లో ఇప్పటివరకు 4.41% మందికి పాజిటివ్‌ రాగా, 24 గంటల్లో నిర్వహించిన పరీక్షల్లో 5.76% మందికి వైరస్‌ సోకినట్లు తేలింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.