close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మరో 945 కేసులు

  16 వేలు దాటిన కొవిడ్‌ బాధితులు
  ఇంకో ఏడుగురి మృతి
  ఒక్కరోజే కోలుకున్నవారు 1,712 మంది

ఈనాడు- హైదరాబాద్‌: రాష్ట్రంలో మంగళవారం మరో 945 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా కరోనా బాధితుల సంఖ్య 16,339కి చేరింది. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ(హైదరాబాద్‌) పరిధిలోనే 869 మందిలో నిర్ధారణ అయింది. రంగారెడ్డి జిల్లాలో 29, సంగారెడ్డిలో 21, మేడ్చల్‌లో 13, నిర్మల్‌లో 4, కరీంనగర్‌లో 2, మహబూబ్‌నగర్‌లో 2, సిద్దిపేటలో 1, సూర్యాపేటలో 1, ఖమ్మంలో 1, వికారాబాద్‌లో 1, నిజామాబాద్‌లో 1 చొప్పున నిర్ధారణ అయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో, ఐసోలేషన్‌లో 8,785 మంది చికిత్స పొందుతున్నారు. మంగళవారం అత్యధిక సంఖ్యలో ఒక్కరోజే 1,712 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. ఇందులో ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయినవారితో పాటు ప్రభుత్వ, గృహ ఐసోలేషన్‌లో 14 రోజుల గడువు తీరినవారూ ఉన్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. దీంతో మొత్తంగా ఇప్పటి వరకూ కొవిడ్‌ బారినపడినవారిలో ఆరోగ్యవంతులుగా కోలుకున్నవారి సంఖ్య 7,294కు చేరుకుంది. మహమ్మారికి చిక్కి మరో ఏడుగురు మృతిచెందగా, మొత్తంగా మృతుల సంఖ్య 260కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 3,457 నమూనాలను పరీక్షించారు. ఇప్పటి వరకూ మొత్తంగా 88,563 పరీక్షలు చేశారు. వీటిల్లో 72,224 మందిలో వైరస్‌ నిర్ధారణ కాలేదు.

ఏపీలో 704 మందికి కొవిడ్‌
ఈనాడు, ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఏపీలో 24 గంటల్లో 704 మందికి కరోనా సోకగా ఏడుగురు చనిపోయారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 18,114 నమూనాల్ని పరీక్షించారు. స్థానికంగా 648 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధరణ కాగా... పొరుగు రాష్ట్రాల నుంచి వారిలో 51 మంది, విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో ఐదుగురు కరోనా బారినపడ్డారు.  కృష్ణా జిల్లాలో ముగ్గురు, కర్నూలు జిల్లాలో ఇద్దరు, గుంటూరు, అనంతపురం జిల్లాలో ఒకరు చొప్పున మృత్యువాతపడ్డారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మరణాల సంఖ్య 187కు చేరింది. తాజాగా 258 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో 6,161 మంది, కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో 1,736 మంది చికిత్స పొందుతున్నారు.


శాసనసభ ఉపసభాపతి పద్మారావుకు కరోనా

సికింద్రాబాద్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి, సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే టి.పద్మారావుకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ఆయన కార్యాలయ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ఇటీవల కొవిడ్‌ లక్షణాలు కనిపించడంతో పద్మారావు, ఆయన కుటుంబసభ్యులు ప్రైవేట్‌ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో పద్మారావుతోపాటు ఆయన చిన్న కూతురు, ఇద్దరు మనవళ్లు, ఆయన తమ్ముని కుమారుడికి కూడా కరోనా పాజిటివ్‌ అని తేలింది. వైద్యుల సూచనల మేరకు వారంతా హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. నియోజకవర్గంలో ఇటీవల నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆయనకు కరోనా వైరస్‌ సోకినట్లు భావిస్తున్నారు. ఉపసభాపతితో సన్నిహితంగా మెలిగినవారు కూడా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నట్లు సమాచారం.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.