close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పాలమూరు-రంగారెడ్డి అనధికారిక ప్రాజెక్టే

దానికి పర్యావరణ అనుమతి కూడా లేదు
రాయలసీమ ఎత్తిపోతలతో ఆ ప్రాజెక్టుకు నష్టం వాటిల్లదు
గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఎదుట ఏపీ వాదన

ఈనాడు హైదరాబాద్‌: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనధికారికంగా చేపట్టిన ప్రాజెక్టు అని, దానికి పర్యావరణ అనుమతి కూడా లభించలేదని ఆంధ్రప్రదేశ్‌ పేర్కొంది. తాము చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల ఆ ప్రాజెక్టుకు ఎలాంటి నష్టం వాటిల్లదని తెలిపింది. శ్రీశైలం నుంచి నీటిని తీసుకొనేలా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై స్టే ఇస్తూ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఆదేశాలు ఇవ్వగా, దాని ఎదుట ఆంధ్రప్రదేశ్‌ తన వాదనను సమర్పించింది. దీనిపై వాదనలు జరిగి రాయలసీమ ఎత్తిపోతల టెండర్‌ ప్రక్రియ చేపట్టడానికి గ్రీన్‌ ట్రైబ్యునల్‌ అనుమతించింది.

ఆంధ్రప్రదేశ్‌ ఏమని వాదించింది?
ఆంధ్రప్రదేశ్‌ తరఫున ఆ రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ముందు దాఖలు చేసిన వాదనలో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
* పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనధికార ప్రాజెక్టు. 2006 ఇ.ఐ.ఎ. నోటిఫికేషన్‌ ప్రకారం ఈ ప్రాజెక్టుకు ఇంకా అనుమతి రాలేదు. నిర్మాణానికి ముందు చేపట్టే పనులకు అనుమతి వచ్చింది తప్ప ఇప్పటివరకు తుది అనుమతి రాలేదు. పర్యావరణ అనుమతి లేకుండా, రిజర్వ్‌ ఫారెస్టులో దీనిని నిర్మిస్తున్నారు.ఈ ప్రాజెక్టు రెండు రాష్ట్రాలు పరస్పరం అంగీకారం తెలిపిన వాటి జాబితాలో కూడా లేదు.అలాంటి ప్రాజెక్టు పరిధిలో హక్కులకు భంగం వాటిల్లుతుందని దరఖాస్తుదారు పేర్కొనడం ఆశ్చర్యంగా ఉంది.
* ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు, నిర్వహణ కార్యాచరణను రూపొందించే బాధ్యతను ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం కృష్ణా జల వివాద ట్రైబ్యునల్‌-2కు ఇచ్చింది. ఇదే సమయంలో 2015 జూన్‌ 18-19 తేదీల్లో రెండు రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందంలో ప్రాజెక్టుల వారీగా వినియోగం, నీటి వినియోగ నిర్వహణను కృష్ణాబోర్డు చూడాలని నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా పర్యావరణ అనుమతి కూడా పొందకుండానే పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను చేపట్టింది.
* ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రోజుకు మూడు టీఎంసీల నీటిని మళ్లించేలా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతి వచ్చింది. పిటిషన్‌దారు నివసించేది తెలంగాణలో.. పని చేపట్టేది ఆంధ్రప్రదేశ్‌లో. దీనివల్ల దరఖాస్తుదారు నివసించే ప్రాంతంపై ఎలాంటి పర్యావరణ ప్రభావం ఉండదు. అంతర్‌ రాష్ట్ర జల సమస్యను పర్యావరణ సమస్యగా చూపిస్తున్నారు. రెండు రాష్ట్రాల అవసరాలకు సంబంధించి వాద, ప్రతివాదనలు కృష్ణా జల వివాద ట్రైబ్యునల్‌ ముందు ఉన్నాయి.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.