close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఎవరు ఏమన్నారు

ప్రాణసంకటం కాకూడదు

పాఠశాలలు తెరవాల్సిందే అంటున్నారు. ప్రాణాలు కావాలో, ఉద్యోగాలు కావాలో ఎంచుకోవాల్సిన బలవంతపు పరిస్థితులు ఉపాధ్యాయులకు రానీయకూడదు.

- హిల్లరీ క్లింటన్‌


సచిన్‌ను వదులుకోవడం దురదృష్టకరం

మరో స్నేహితుడు సచిన్‌ పైలట్‌ పార్టీని వీడారు. సచిన్‌, జ్యోతిరాదిత్య ఇద్దరూ నాకు మంచి స్నేహితులే. దురదృష్టవశాత్తూ మంచి సామర్థ్యమున్న ఇద్దరు యువ కెరటాలను మా పార్టీ వదులుకుంది. మంచి స్థానాలకు చేరాలనుకోవడం తప్పేమీ కాదు. క్లిష్టసమయాల్లో వారు చాలా కష్టపడ్డారు.

-ప్రియాదత్‌, కాంగ్రెస్‌ మాజీ ఎంపీ


ఓటీటీపైకి రావాల్సిందే

థియేటర్లు కనీసం సంవత్సరం వరకు తెరుచుకోవు. తారలంతా ఓటీటీ లోకి రావాల్సిందే. లేదంటే వారి సొంత యాప్‌ల ద్వారా సినిమాలను విడుదల చేసుకోవాల్సిందే.

- శేఖర్‌ కపూర్‌


చింపాంజీల ఉనికికి ప్రమాదం

చింపాజీల డీఎన్‌ఏ, మన డీఎన్‌ఏ 98శాతం ఒకటే. ఇంతటి దగ్గరి సంబంధం ఉన్నా వాటి ఆవాసాలను మనం లాక్కుంటున్నాం. అక్రమంగా రవాణా చేయడం, వేట వంటి కారణాలతో వాటి ఉనికి ప్రమాదంలో పడింది.

- అంకిత్‌ కుమార్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారి


తల్లిదండ్రులను చిన్న పిల్లల్లాగా చూడండి

తల్లిదండ్రుల వయస్సు 60 దాటాక వారిని చిన్న పిల్లల్లాగా భావించి మసలుకోండి. అప్పుడు తరాల అంతరం కాస్తా తరాలమధ్య వారధి అవుతుంది.

- పవన్‌ కాంబోజ్‌, ఐఆర్‌ఎస్‌ అధికారి

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.