close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చికిత్స ఖరీదంటూ ఆసుపత్రి నుంచి ఏ ఒక్కరినీ వెనక్కి పంపకూడదు

సుప్రీంకోర్టు స్పష్టీకరణ

దిల్లీ: చికిత్సకు ఎక్కువ ఖర్చు అవుతుందంటూ ఏ ఒక్కరోగిని ఆసుపత్రి నుంచి వెనక్కి పంపకూడదని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టంచేసింది. అదే సమయంలో కొవిడ్‌-19 సోకిన బాధితులకు చికిత్సకు అయ్యే వ్యయంపై మార్గదర్శకాలు రూపొందించే అంశాన్ని పరిశీలించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుత పరిస్థితుల్లో చికిత్స ఖర్చు ఎక్కువగా ఉండకూదని అభిప్రాయపడింది. కరోనా వైరస్‌ సోకిన బాధితులకు ఏది మెరుగైన చికిత్సో న్యాయస్థానం చెప్పలేదని, చికిత్స ఖర్చును నియంత్రించలేదని స్పష్టంచేసింది. ఈ మేరకు న్యాయవాది సచిన్‌ జైన్‌ దాఖలుచేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.రెడ్డి, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్నలతో కూడిన ధర్మాసనం వీడియో సమావేశం విధానంలో విచారణ చేపట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్‌-19 చికిత్స ఖర్చును నియంత్రించేలా ఆదేశాలు ఇవ్వాలని సచిన్‌ తన పిటిషన్‌లో అభ్యర్థించారు. మహమ్మారి కరాళనృత్యం చేస్తున్న ప్రస్తుత సమయంలో కొన్ని ఆసుపత్రులు కొవిడ్‌-19 చికిత్సకు అన్యాయమైన ధరలు నిర్ణయించి, వసూలు చేస్తున్నాయని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ.. కరోనా వైరస్‌కు సంబంధించిన అన్ని అంశాలను ప్రభుత్వం గమనిస్తోందని,  పిటిషనర్‌ పేర్కొన్న అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తామని పేర్కొన్నారు.

పేద గర్భిణులకు సహాయంపై నివేదిక ఇవ్వండి

 

- కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన సుప్రీంకోర్టు

దిల్లీ: పేద గర్భిణులు, పాలిచ్చే తల్లులకు ప్రసూతి ప్రయోజనాల కింద నెలకు రూ.6,000 సహాయం చేసే పథకం పరిస్థితిపై నివేదిక ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ (పీయూసీఎల్‌) అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్‌ ఆర్‌.సుభాశ్‌రెడ్డి, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్నలతో కూడిన ధర్మాసనం వీడియో సమావేశం విధానంలో విచారణ చేపట్టింది. నివేదిక సమర్పించాలంటూ సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను ఆదేశించింది. జులై 5, 2013న అమల్లోకి వచ్చిన జాతీయ ఆహార భద్రత చట్టంలో పేర్కొన్న అంశం ప్రకారం పేద గర్భిణులు, పాలిచ్చే తల్లులకు నెలకు కనీసం రూ.6,000 ఆర్థిక సహాయం చేయాలి.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.