close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాష్ట్రంలో 37వేలు దాటిన బాధితులు

కొత్తగా 1524 కేసులు  
ఒక్కరోజే అత్యధికంగా 13 వేలకు పైగా పరీక్షలు  
మరో 10 మంది మృతి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మంగళవారం కొత్తగా 1524 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తంగా కొవిడ్‌ బాధితుల సంఖ్య 37,745కు పెరిగింది. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ (హైదరాబాద్‌) పరిధిలో 815 కేసులు నమోదు కాగా, రంగారెడ్డిలో 240, మేడ్చల్‌లో 97, సంగారెడ్డిలో 61, కామారెడ్డిలో 19, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 30, కరీంనగర్‌లో 29, మెదక్‌లో 24, మంచిర్యాలలో 12, జయశంకర్‌ భూపాలపల్లిలో 12, నల్గొండలో 38, రాజన్న సిరిసిల్లలో 19, వికారాబాద్‌లో 21, నిజామాబాద్‌లో 17, సూర్యాపేటలో 15, గద్వాలలో 13 చొప్పున కేసులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో, ఐసోలేషన్‌లో 12,531 మంది చికిత్స పొందుతుండగా, తాజాగా మరో 1161 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ కరోనా బారినపడి కోలుకున్నవారి సంఖ్య 24,840కి చేరుకుంది. మంగళవారం కొవిడ్‌తో 10 మంది మృత్యువాతపడగా, మొత్తంగా మరణాల సంఖ్య 375కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 13,175 నమూనాలను పరీక్షించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్కరోజు పరీక్షించిన నమూనాల్లో ఇదే అత్యధికం. మొత్తంగా రాష్ట్రంలో 1,95,024 పరీక్షలు నిర్వహించగా, వీరిలో 1,57,279 మందిలో వైరస్‌ లేదని తేలింది.
‘ పీఐబీవి తప్పుడు ఆరోపణలు’
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) తప్పుడు ఆరోపణలు చేసిందని ప్రజారోగ్య సంచాలకులు జి.శ్రీనివాసరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. పీఐబీ మంగళవారం విడుదల చేసిన బులెటిన్‌లో తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) నిర్దేశించిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం కచ్చితంగా అమలు చేసిందన్నారు. పీఐబీ నివేదికలో పేర్కొన్నవి నిరాధార ఆరోపణలనీ, కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరును దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన విమర్శించారు. ఇటువంటి తప్పుడు ప్రచారాల పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ, కొవిడ్‌ 19 నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
పీఐబీ ఏమి చెప్పిందంటే..
ప్రభుత్వం సరిగా పరీక్షలు చేయడం లేదంటూ హైకోర్టు చివాట్లు పెట్టిందనీ, ప్రజారోగ్య సంచాలకులను పిలిచి దీనిపై వివరణ అడిగిందని పీఐబీ మంగళవారం విడుదల చేసిన కరోనా బులెటిన్‌లో పేర్కొంది. ఆలస్యంగా యాంటీజెన్‌ పరీక్షలను మొదలుపెట్టిందనీ, ఐసీఎంఆర్‌ నియమ నిబంధనలను సరిగా పాటించడం లేదంది. యాంటీజెన్‌ పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినవారికి ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలు చేయాలని ఐసీఎంఆర్‌ సూచించినా.. ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ పీఐబీ క్షేత్రస్థాయి అధికారులు ఇచ్చిన సమాచారాన్ని ప్రాతిపదికగా చేసుకొని ఈ బులెటిన్‌ను విడుదల చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మండిపడింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.