close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
80% కేసుల్లో లక్షణాలు లేవు

రాబోయే మూడు నెలలు కీలకం
కరోనా తగ్గుముఖం పడుతుందన్న అంచనాలున్నాయి
తెలంగాణలో మరణాల రేటు 1%
వైద్యఆరోగ్యశాఖ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో 80 శాతం మందికి వ్యాధి లక్షణాలే లేవని వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. జాతీయ స్థాయిలో కొవిడ్‌ మరణాల రేటు 2.7 శాతం ఉంటే తెలంగాణలో అది ఒక్క శాతంగా ఉందన్నారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలపై రాష్ట్ర ప్రజారోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు, వైద్యవిద్య సంచాలకులు రమేష్‌రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. రాబోయే మూడు నెలలు కీలకమని, క్రమంగా కరోనా తగ్గుముఖం పడుతుందన్న అంచనాలు ఉన్నాయని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని, అవసరమైన వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని స్పష్టం చేశారు.
జీహెచ్‌ఎంసీలో 300 ఆసుపత్రుల్లో పరీక్షలు
‘‘రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్యను పెంచాం. సోమవారం ఒక్క రోజే 11,525 పరీక్షలు చేశాం. హైదరాబాద్‌లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నందున జీహెచ్‌ఎంసీ పరిధిలో 300 ఆసుపత్రుల్లో ఈ పరీక్షలు చేస్తున్నాం. ప్రయివేటు వైద్య కళాశాలల్లోనూ కొవిడ్‌ చికిత్స ఉచితంగా అందిస్తున్నాం. రాష్ట్రంలో 98 ఆసుపత్రులకు కొవిడ్‌ చికిత్సకు అనుమతి ఉంది. ప్రస్తుతం 54 ఆసుపత్రుల్లో ఈ ప్రక్రియ ప్రారంభమైంది’’ అని శ్రీనివాసరావు వివరించారు. కరోనా వ్యాధి లక్షణాలు కనిపించినప్పుడు తప్పనిసరిగా చికిత్సకు సిద్ధం కావాలని, సొంత వైద్యం ప్రమాదకరమని సూచించారు.
కరోనాతో పాటు డెంగీ ముప్పు
‘‘ప్రస్తుతం డెంగీ, మలేరియా వంటి సీజనల్‌ వ్యాధుల ముప్పు కూడా పొంచి ఉంది. దోమలు వృద్ధి చెంది డెంగీ ప్రబలకుండా ఇంటి పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా చేసుకోవాలి. పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ సూచించిన విధంగా ప్రతి ఆదివారం పరిసరాలను శుభ్రం చేసుకోవాలి’’ అని శ్రీనివాసరావు సూచించారు.
ప్లాస్మాథెరపీ అందరికీ సరికాదు
వైద్యవిద్య సంచాలకులు రమేష్‌రెడ్డి మాట్లాడుతూ..  ‘‘అత్యవసర పరిస్థితుల్లో గాంధీలోనే చికిత్స అందిస్తాం. ఆక్సిజన్‌ లైన్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాం. కావాల్సిన మందులు సిద్ధంగా ఉన్నాయి. కరోనా లక్షణాలు లేని వారు గాంధీలో చేరటం వల్ల ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశం ఉంది’’ అని చెప్పారు.  పలు సందర్భాల్లో ప్రయివేటు ఆసుపత్రులు చివరి నిమిషంలో రోగులను గాంధీకి పంపటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ప్లాస్మాథెరపీ అందరికీ సరికాదని,  ప్లాస్మాబ్యాంకు ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఆందోళన తగదు
ఈ కీలక సమయంలో అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఆందోళన చేయటం తగదు.. వారి వేతనాలు పెంచుతామని రమేష్‌రెడ్డి చెప్పారు. ఉద్యోగ క్రమబద్ధీకరణ కోర్టు పరిధిలో ఉన్న విషయాన్ని గుర్తించి ఉద్యోగులు విధులకు హాజరుకావాలని కోరారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.