close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇకపై ‘తెలుగువెలుగు, బాలభారతం’ ఈ-పత్రికలు

మొబైల్‌ పత్రికలుగా కొత్త రూపు

 

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగువెలుగు, బాలభారతం పత్రికల ఆగస్టు సంచికలను ఈనాడు.నెట్‌లో విడుదల చేసినట్లు రామోజీ ఫౌండేషన్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. చతుర, విపుల పత్రికలు ఇప్పటికే ఈనాడు.నెట్‌లో అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇకనుంచి ఈ నాలుగు పత్రికలూ ప్రతి నెలా ఒకటో తేదీ ఉదయమే eenadu.netలో విడుదల అవుతాయి.
మొబైల్‌ పరిమాణంలోనే: స్మార్ట్‌ ఫోన్‌లో చదివే వారిని దృష్టిలో ఉంచుకుని  ‘మొబైల్‌ మ్యాగజైన్‌’లనూ రూపొందించారు. కళ్లకు హాయిగా, చదవడానికి తేలిగ్గా ఉండే ‘మొబైల్‌ మ్యాగజైన్‌’ల రూపకల్పన తెలుగులో ఇదే తొలిసారి. మొబైల్‌లో ఈనాడు.నెట్‌లోకి వెళ్లి ఈ-పత్రికల మీద క్లిక్‌ చేస్తే మొబైల్‌ పత్రికలు తెరుచుకుంటాయి. డెస్క్‌టాప్‌ లేదా ట్యాబ్‌లో చూస్తే పెద్ద పత్రికలు కనిపిస్తాయి.
 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.