close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పాల కల్తీ గుట్టు పసిగట్టు

అధునాతన పరిజ్ఞానంతో రిఫరల్‌ ప్రయోగశాలల ఏర్పాటుకు యత్నాలు

ఈనాడు, హైదరాబాద్‌: పాల నాణ్యత పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కొందరు వ్యాపారులు పాలలో అనేక రకాల రసాయనాలు, గంజిపొడి వంటివి కల్తీ చేస్తున్నారు. నిల్వ పాల అమ్మకాలూ ఎక్కువగా జరుగుతున్నాయి. వినియోగదారులు కల్తీని తెలుసుకోడానికి పశుసంవర్థకశాఖ అధునాతన పరిజ్ఞానంతో రిఫరల్‌ పాల ప్రయోగశాలలను ఏర్పాటుచేయనుంది. ప్రజలెవరైనా వీటికి పాలను తీసుకెళ్లి నాణ్యతను పరీక్షించుకోవచ్చు. ఒకవేళ కల్తీ ఉందని తేలితే పాలు అమ్మిన వారిపై కేసులు పెట్టి శిక్ష పడేలా చేయవచ్చు. ఐదారు నెలల్లో ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశముంది. వీటి ఏర్పాటు కోసం కేంద్రం రూ. 5 కోట్లను విజయ డెయిరీకి కేటాయించింది. ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే కొన్నిచోట్ల రిఫరల్‌ ప్రయోగశాలలున్నాయి. హైదరాబాద్‌లోని కొన్ని కాలనీల్లో ముందుగా వీటిని ఏర్పాటుచేస్తారు. ఇక్కడ పాలను పరీక్షించి వెంటనే ఫలితాలు ఇస్తారు. పరీక్ష రుసుం కూడా తక్కువ ఉండేలా చూస్తామని పశుసంవర్ధకశాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర ‘ఈనాడు’కు చెప్పారు.

కల్తీ అధికం...
పాల కల్తీ సర్వసాధారణమైంది. యూరియా, డిటర్జెంట్లు, బోరిక్‌ యాసిడ్‌ వంటి రసాయనాలను కలుపుతున్నారు.
నిల్వ పాల అమ్మకాలు కూడా మామూలైపోయింది. ప్రైవేటు డెయిరీలు ఇలాంటివాటిని విజయ డెయిరీకి తెస్తే పరీక్షించి తిరస్కరిస్తున్నట్లు ఎండీ శ్రీనివాసరావు చెప్పారు. సామాన్య ప్రజలు కల్తీ గురించి తెలుసుకోవాలంటే ప్రయోగశాలలు అందుబాటులో లేవు. ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలు చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా ప్రయోగశాలలు ఏర్పాటుచేయాలని పశుసంవర్ధకశాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అలాగే గ్రామాల్లో విజయ డెయిరీ పాలసేకరణ కేంద్రాలకు రోజూ రైతులు తెచ్చే పాల నాణ్యతను వారి ముందే పరీక్షించి తీసుకునేందుకు ‘మిల్క్‌ అనలైజర్లు’ ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే వీటిని పెట్టామని విజయ డెయిరీ మేనేజింగ్‌ డైరక్టర్‌ శ్రీనివాసరావు వివరించారు.

ఆన్‌లైన్‌లో రక్షణ శాఖ కిట్‌
ఆన్‌లైన్‌లో ఈ-కామర్స్‌ సంస్థలు పాల పరీక్షల కిట్‌లను అమ్ముతున్నాయి. రక్షణశాఖ రూపొందించిన ఒక కిట్‌ను అమెజాన్‌ రూ.1000కి అమ్ముతోంది. ఒక చిన్న స్ట్రిప్‌పై పాల చుక్కలు వేయగానే రంగు మారితే అవి కల్తీ అయ్యాయని తెలుస్తుంది. ఇలాంటి కిట్‌లు అనేకం మార్కెట్‌లో అందుబాటులో ఉన్నా ప్రయోగశాలల్లో అయితే సమగ్ర ఫలితాలను తెలుసుకోవచ్చు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.