close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
భారత్‌లో ఆక్స్‌ఫర్డ్‌ టీకాపై పరీక్షలు

సీరం ఇన్‌స్టిట్యూట్‌కు నుమతినిచ్చిన డీజీసీఐ

దిల్లీ: కొవిడ్‌-19ను నివారించేందుకు ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన ప్రయోగాత్మక టీకాను భారత్‌లో పరీక్షించేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ)కు అనుమతి లభించింది. ఆ వ్యాక్సిన్‌కు సంబంధించి 2, 3 దశల్లో క్లినికల్‌ పరీక్షలు నిర్వహించేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీజీసీఐ) పచ్చ జెండా ఊపింది. విశాఖపట్నంలోని ఆంధ్రా వైద్య కళాశాల సహా దేశంలో ఎంపిక చేసిన 17 చోట్ల వీటిని నిర్వహిస్తారు. కొవిడ్‌-19పై ఏర్పాటైన నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీసీఐ జి.సోమాని పేర్కొన్నారు. క్లినికల్‌ ప్రయోగాలకు సంబంధించిన భద్రతా డేటాను కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీవో)కు సమర్పించాలని ఎస్‌ఐఐకి సూచించినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ‘‘ఒక్కో పరీక్షార్థికి రెండు డోసుల మేర ఈ టీకాను ఇవ్వనున్నట్లు అధ్యయన ప్రణాళిక పేర్కొంది. ఈ రెండు డోసులకు మధ్య నాలుగు వారాల విరామం ఉంటుంది. ఆ తర్వాత టీకా భద్రత, రోగ నిరోధక సామర్థ్యం గురించి విశ్లేషణ జరుపుతారు’’ అని వివరించారు. ‘కొవిషీల్డ్‌’ అనే ఈ టీకాను భారత్‌లో పరీక్షించేందుకు అనుమతినివ్వడం వల్ల వ్యాక్సిన్‌ అభివృద్ధి ప్రక్రియ వేగవంతమవుతుందని తెలిపారు. 18 ఏళ్లు పైబడ్డ 1600 మందిపై ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు.

బ్రిటన్‌లో నిర్వహించిన మొదటి రెండు దశల క్లినికల్‌ పరీక్షల్లో ఈ టీకా సురక్షితమైనదేనని, కరోనాపై పోరాడేలా రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తోందని ప్రాథమికంగా వెల్లడైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆక్స్‌ఫర్డ్‌ టీకా ఉత్పత్తి కోసం ఆస్ట్రాజెనెకా సంస్థతో ఎస్‌ఐఐ చేతులు కలిపింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.