close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కొత్తగా 1286 కేసులు

  12 మరణాలు
  మొత్తం బాధితులు 68,946
  3న రాత్రి 8 గంటల వరకు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో సోమవారం 1286 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 68,946కు పెరిగింది. ఈ నెల 3వ తేదీ రాత్రి 8 గంటల వరకూ నమోదైన కొవిడ్‌ కేసుల సమాచారాన్ని వైద్యఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసింది. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 391 కేసులు నమోదయ్యాయి. 20కి పైగా పాజిటివ్‌లు నమోదైన జిల్లాల జాబితాలో రంగారెడ్డి(121), కరీంనగర్‌(101), మేడ్చల్‌ మల్కాజిగిరి(72), వరంగల్‌ నగర(63), నిజామాబాద్‌(59), జోగులాంబ గద్వాల(55), ఖమ్మం(41), మహబూబ్‌నగర్‌(39), భద్రాద్రి కొత్తగూడెం(38), నాగర్‌కర్నూల్‌(29), నల్గొండ(29), పెద్దపల్లి(29), మహబూబాబాద్‌(27), సూర్యాపేట(23), జగిత్యాల(22), మంచిర్యాల(21) జిల్లాలున్నాయి. సోమవారం 1,066 మంది కోలుకోగా, ఇప్పటివరకూ రాష్ట్రంలో కొవిడ్‌ నుంచి కోలుకున్నవారి సంఖ్య 49,675కు చేరుకుంది. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 72 శాతం.
* కరోనాతో మరో 12 మంది మృత్యువాతపడ్డారు. దీంతో కొవిడ్‌ మరణాల సంఖ్య 563కు పెరిగింది.
* ప్రస్తుతం కరోనాతో 18,708 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో ఆసుపత్రుల్లోని ఐసొలేషన్‌లో, ఇళ్లలో వైద్యసేవలు పొందుతున్నవారు 11,935 మంది ఉన్నారు.
* సోమవారం 13,787 నమూనాలను పరీక్షించారు. రాష్ట్రంలో మొత్తం పరీక్షల సంఖ్య 5,01,025కు పెరిగింది. మరో 919 నమూనాల ఫలితాలు వెల్లడవ్వాల్సి ఉంది.
పడకల ఖాళీలు
ఈ నెల 3 నాటికి రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం 8,436 పడకలను కొవిడ్‌ కోసం కేటాయించారు. 5,907 పడకలు అందుబాటులో ఉన్నాయి.
ప్రైవేటు ఆసుపత్రుల్లో 6,753 పడకలను కరోనా సేవలకు కేటాయించగా, వీటిలో 2,509 పడకలు అందుబాటులో ఉన్నాయి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.