close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గతేడాది కన్నా ఎక్కువ రుణాలిచ్చాం

 ఆగస్టు 4 వరకు రూ.11,093 కోట్ల రుణాలు పంపిణీ
 మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడి
 వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో కూడా గతేడాదితో పోలిస్తే ఈ వానాకాలం సీజన్‌లో రైతులకు ఎక్కువ పంట రుణాలు ఇచ్చామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం తన నివాసంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి జనార్దన్‌రెడ్డి, రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి కన్వీనర్‌ సీతాపతిశర్మ, టెస్కాబ్‌ ఛైర్మన్‌ కె.రవీందర్‌రావు, ఎండీ మురళీధర్‌ తదితరులు పాల్గొన్నారు. ‘ఈనాడు’లో మంగళవారం ‘రుణాలేవి సారూ!’ శీర్షికన ప్రచురితమైన కథనానికి మంత్రి స్పందించి మాట్లాడుతూ, ‘‘జులై 6న రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించి పంటరుణాల ప్రణాళిక విడుదల చేశాం. ప్రస్తుత వానాకాలంలో రూ.31,936 కోట్లను రైతులకు రుణాలుగా ఇవ్వడానికి బ్యాంకులు లక్ష్యంగా పెట్టుకున్నాయి. మంగళవారం(4వ తేదీ) వరకు రూ.11,093 కోట్లను పంపిణీ చేశాయి. గతేడాది జులై నెలాఖరుకు రూ.10,580 కోట్లు మాత్రమే ఇచ్చాయి. సహకార బ్యాంకులు ఈ ఏడాది రూ.1516.88 కోట్లు ఇవ్వగా, గతేడాది ఈ సమయానికి రూ.1,296 కోట్ల రుణాలు మాత్రమే ఇచ్చాయి. గతేడాది ఈ సమయం (ఆగస్టు 4) వరకు 11,77,326 మంది రైతులు అన్ని బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోగా ఈ ఏడాది 12,97,267 మంది రుణాలు తీసుకున్నారు. వానాకాలంలో పంటరుణాల విడుదలపై గత నాలుగేళ్ల వివరాలు సేకరించినా ఈ ఏడాది ఎక్కువ రుణాలు ఇచ్చాం. అవసరం లేకుంటే రైతు అప్పులు తీసుకోడు. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల బారిన పడకూడదనే దేశంలో రైతులకు రుణాలు ఇవ్వడం జరుగుతుంది. రైతులు అప్పులబారిన పడకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు, రుణమాఫీ పథకాలతోపాటు అనేక సౌకర్యాలను కల్పిస్తోంది. రైతులు అప్పుల నుంచి ఆత్మవిశ్వాసం వైపు నడుస్తున్నారు. కరోనాతో రాష్ట్ర రాబడి రూ.50 వేలకోట్లు రాకున్నా రూ.7251 కోట్లు రైతుబంధు కింద రైతులకు ప్రభుత్వం ఇచ్చింది.. రూ.30 వేల కోట్లతో వందశాతం పంటలను ప్రభుత్వం కల్లాల వద్దకే వెళ్లి కొనుగోలు చేసింది. రూ.25 వేలలోపు బ్యాంకుల్లో బాకీలున్న 2.87 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఏకకాలంలో పూర్తి చేశాం. వివిధ బ్యాంకుల నుంచి గత ఏడాది పంటరుణాలు తీసుకున్న రైతుల సంఖ్య 41,31,004. గత ఆరేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకున్న చర్యల మూలంగా 70 శాతం భూములకు సాగునీరు రావడంతో వరసగా పంటలు పండి మెజారిటీ రైతాంగం ఆర్థికంగా బలపడిందన్నది వాస్తవం. పింఛన్లు, రైతుబంధు, ప్రభుత్వమే పంటలు కొనుగోలు చేయడం, రైతులకు పంటలు మంచిగా పండడం వంటి కారణాలతో తెలంగాణ గ్రామీణ ఆర్థికరంగం స్థిరంగా ఉందన్నది యథార్థం. వ్యవసాయం బలోపేతంతో వ్యవసాయ అనుబంధరంగాలు, గ్రామీణ వృత్తులు జీవం పోసుకుంటున్నాయి. రైతుల ఆత్మవిశ్వాసాన్ని పెంచి సగర్వంగా వ్యవసాయం చేసుకోగలను అనేలా ప్రభుత్వం పనిచేస్తుంది’’ అని చెప్పారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.