close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాష్ట్రంలో తనిఖీలకు నిర్ణయం

విజయవాడ సంఘటనతో ఉలికిపాటు

ఈనాడు, హైదరాబాద్‌:  విజయవాడలో కొవిడ్‌ బాధితుల ఐసొలేషన్‌కు వినియోగిస్తున్న హోటల్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోనూ కొన్ని ఆసుపత్రులు హోటల్‌ గదుల్లో కరోనా బాధితుల ఐసొలేషన్‌ కేంద్రాలు నిర్వహిస్తున్నాయి. వాటితో పాటు ఆసుపత్రుల్లోనూ అగ్నిమాపక నిబంధనలను పాటిస్తున్నారా? లేదా? అనే అంశంపై సత్వరమే పరిశీలన జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో హైదరాబాద్‌తో పాటు ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ హోటళ్లలో ఐసొలేషన్‌ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. తీవ్ర సమస్యలు లేని బాధితులు వీటిల్లో చేరుతున్నారు.

నిబంధనలు పాటించేవి తక్కువే
ఏ ఆసుపత్రి భవనానికైనా అగ్నిమాపక నిబంధనలు ఒక్కటే. వాటిని పూర్తిస్థాయిలో పాటించే ఆసుపత్రులు సగానికి మించవని తెలుస్తోంది. నిబంధనలు పక్కాగా అమలు చేయాలంటే నెలకు రూ.10 లక్షల వరకు ఖర్చవుతుందన్న ఉద్దేశంతోనే ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలున్నాయి. భవనం చుట్టూ స్థలం వదలాలన్న నిబంధనను అధిక శాతం ఆసుపత్రులు పాటించట్లేదని గతంలో చేపట్టిన పరిశీలనలో వెల్లడైంది.

అగ్నిమాపక శాఖ అనుమతులున్నాయా?
కొవిడ్‌ ఐసొలేషన్‌ కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్రంలో 36 హోటళ్లు అనుమతి పొందినా.. అనధికారికంగా మరో 50 హోటళ్లు నడుస్తున్నట్లు తెలుస్తోంది. వీటిలో స్థాయిని బట్టి రోజుకు రూ.3 వేల నుంచి రూ.12 వేల వరకూ వసూలు చేస్తున్నారు. కొన్ని హోటళ్లలో కనీస ప్రమాణాలు పాటించడం లేదని, పౌష్టికాహారం అందించడంలేదంటూ ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖకు ఫిర్యాదులొచ్చాయి. హోటళ్లలో వినియోగించే అగ్నిమాపక సామగ్రి కంటే అదనపు సామగ్రిని ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయాలి. హోటళ్లలో కొవిడ్‌ కేర్‌ కేంద్రాల ఏర్పాటుకు అగ్నిమాపకశాఖ అనుమతులు తీసుకోవాలి. కానీ వీటిపై ఆ శాఖ ఉన్నతాధికారుల వద్ద సరైన సమాచారం లేకపోవడం గమనార్హం. విజయవాడ ప్రమాదంతో ఆ శాఖ తనిఖీలకు సిద్ధమవుతోంది.


 నిబంధనల్లో కొన్ని... 

* అగ్ని ప్రమాద సమయంలో మంటలు పక్కనున్న భవనాలకు వ్యాపించకుండా నిరంతరాయంగా నీటిని వెదజల్లేలా భవనంపైన నీటితెర ఏర్పాటు చేయాలి.
* ప్రతి గదిలోనూ పొగను గుర్తించి, ప్రమాద హెచ్చరికలు చేసే పరికరాలను అమర్చాలి.
* ప్రతి అంతస్తులో, గదిలో నీటిని వెదజల్లే యంత్రాలను బిగించాలి.
* భవనానికి రెండు వైపులా మెట్లు నిర్మించాలి. అగ్నిప్రమాదం జరిగినప్పుడు రోగులు, సిబ్బంది రెండో మెట్ల మార్గం నుంచి బయటకు రావడానికి వీలుగా, అందరికీ తెలిసేలా పెద్దక్షరాలతో దానికి సంబంధించిన సంకేతాలను ఏర్పాటు చేయాలి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.