close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాజీస్థాన్‌!

గహ్లోత్‌తో పైలట్‌ కరచాలనం
నేటి నుంచి రాజస్థాన్‌ శాసనసభ సమావేశాలు

జైపుర్‌: కాంగ్రెస్‌ పార్టీలో అపోహలు గతం... గతః అని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ పేర్కొన్నారు. గత నెలరోజుల్లో పార్టీలో ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో పొరపాట్లు ఉంటే వాటిని క్షమించి, ముందుకు సాగాలని చెప్పారు. ప్రజాస్వామ్య ప్రయోజనాల రీత్యా అది అవసరమన్నారు. ‘ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ప్రమాదకర క్రీడ మన దేశంలో కొనసాగుతోంది. ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చివేసే కుట్రలు ఆగడం లేదు. కర్ణాటక, మధ్యప్రదేశ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో ఇలాగే జరిగింది. ఈడీ, సీబీఐ, ఐటీ, న్యాయ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారు’ అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. తిరుగుబావుటా ఎగరేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ గురువారం సీఎం నివాసంలో కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశాని(సీఎల్పీ)కి తన వర్గం ఎమ్మెల్యేలతో సహా హాజరయ్యారు. ఇద్దరు నేతలూ కరచాలనం చేసుకుని తమ మధ్య అంతా సద్దుమణిగిందనే సంకేతాలు పంపించారు.

అధిష్ఠానం జోక్యంతో దారికి..
గహ్లోత్‌-పైలట్‌ల మధ్య నెలకొన్న విభేదాలను రూపుమాపడానికి కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీలు రంగంలో దిగిన విషయం తెలిసిందే. శుక్రవారం నుంచి మొదలయ్యే శాసనసభ సమావేశాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వారిద్దరి మధ్యా అధిష్ఠానం సయోధ్య కుదిర్చింది. దాని ప్రకారం పంతాన్ని పక్కనపెట్టి సీఎల్పీకి పైలట్‌ తన వర్గీయులతో కలిసి వచ్చారు. పార్టీ పరిశీలకులు రణదీప్‌ సూర్జేవాలా, అజయ్‌ మకెన్‌, కె.సి.వేణుగోపాల్‌లతో కలిసి గహ్లోత్‌, పైలట్‌.. కెమెరాలకు ఫోజులిచ్చారు. సమావేశంలో అసెంబ్లీ సమావేశాల వ్యూహాన్ని ఖరారు చేశారు. ప్రతిఒక్కరి సమస్యనూ పరిష్కరిస్తానని గహ్లోత్‌ భరోసా ఇచ్చారు. సభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. సర్కారు కూల్చివేతకు కుట్ర పన్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ను ఎత్తివేసినట్లు కాంగ్రెస్‌ ప్రకటించింది. వేర్వేరు శిబిరాల్లో ఉన్న ఎమ్మెల్యేలంతా తిరిగి జైపుర్‌లోని హోటల్‌కు చేరుకున్నారు.

అవిశ్వాసానికి భాజపా నిర్ణయం
రాజస్థాన్‌లో 200 సీట్లకు గానూ మిత్రపక్షాలతో కలిపి కాంగ్రెస్‌, భాజపాలకు 107, 72 చొప్పున బలం ఉంది. దీంతో విశ్వాస తీర్మానంలో కాంగ్రెస్‌ నెగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. సభలో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని భాజపా శాసనసభాపక్ష సమావేశం ఖరారు చేసిందని విపక్ష నేత గులాబ్‌చంద్‌ కటారియా తెలిపారు. కరోనా తీవ్రత, శాంతి భద్రతల సమస్య తదితరాలపై శుక్రవారమే ఈ తీర్మానం ఉంటుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సతీష్‌ పునియా తెలిపారు. భాజపా శాసనసభాపక్ష సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజె పాల్గొన్నారు. ఆ తర్వాత ఆమె గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రతో భేటీ అయ్యారు.

మధ్యంతర ఉత్తర్వులకు నిరాకరణ
బీఎస్పీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో విలీనం చేసుకుంటూ రాజస్థాన్‌ స్పీకర్‌ గతంలో తీసుకున్న నిర్ణయంపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గురువారం ఈ అంశంపై వీడియో కాన్ఫరెన్సు ద్వారా జస్టిస్‌ అరుణ్‌మిశ్ర నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వాదనలు ఆలకించి, విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది. రాజస్థాన్‌ శాసనసభలో జరిగే ఎలాంటి కార్యకలాపమైనా ఈ అంశంలో తమ తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.