close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
హెచ్‌సీక్యూ వినియోగం.. రెండో స్థానంలో తెలంగాణ

రాష్ట్రంలో 95.58 లక్షల మాత్రల వినియోగం
వ్యాక్సిన్‌ తయారీ పరుగులో హైదరాబాద్‌ సంస్థలు
భారత్‌ బయోటెక్‌, కాడిలా హెల్త్‌కేర్‌ తొలిదశ ప్రయోగాల్లో అద్భుత ఫలితాలు
రాజ్యసభలో కేంద్రం వెల్లడి

ఈనాడు, దిల్లీ: కరోనా సమయంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రల వినియోగంలో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో నిలిచింది. ఉత్తర్‌ప్రదేశ్‌ తర్వాత అత్యధిక వాడకం ఇక్కడే జరిగినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ సహాయమంత్రి అశ్వినీకుమార్‌ చౌబే మంగళవారం రాజ్యసభకు ఇచ్చిన సమాధానంలో వెల్లడించారు. అన్ని రాష్ట్రాలకూ కలిపి కేంద్రం 10.83 కోట్ల హెచ్‌సీక్యూ మాత్రలు ఇస్తే, రాష్ట్రాలు మరో 5.21 కోట్లు సేకరించాయని చెప్పారు. ఇప్పటివరకు వాటిలో 8.51 కోట్లు వినియోగించాయని వెల్లడించారు. తెలంగాణకు కేంద్రం 42.50 లక్షల మాత్రలు ఇస్తే, ఆ రాష్ట్ర ప్రభుత్వం మరో 94.44 లక్షలు సేకరించిందని పేర్కొన్నారు. అక్కడ 95.58 లక్షల మాత్రలను వాడారని, మరో 41.36 లక్షలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ (98.14 లక్షలు) తర్వాత అత్యధిక మాత్రల వాడకం జరిగింది తెలంగాణలోనేనని చెప్పారు. దాని తర్వాతి స్థానంలో గుజరాత్‌ (92.73 లక్షలు) ఉన్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో 15.08 లక్షల హెచ్‌సీక్యూ మాత్రల వినియోగం జరిగిందని పేర్కొన్నారు. ఆ రాష్ట్రానికి కేంద్రం 31.50 లక్షల మాత్రలు ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం మరో 20 లక్షలు సేకరించిందని తెలిపారు. ఇప్పుడు ఏపీ వద్ద 36.41 లక్షల మాత్రలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. దేశంలో వినియోగమైన మొత్తం హెచ్‌సీక్యూ మాత్రల్లో 11.22% తెలంగాణలో, 1.77% ఆంధ్ర    ప్రదేశ్‌లో జరిగినట్లు పేర్కొన్నారు.
* దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్‌ రోగుల కోసం 15,49,931 ఐసొలేషన్‌ బెడ్లు, 2,31,87 ఆక్సిజన్‌ బెడ్లు, 62,979 ఐసీయూ పడకలు (ఏపీలో 4,766, తెలంగాణలో 1,782), 32,862 వెంటిలేటర్లు (ఏపీలో 1,427, తెలంగాణలో 518) అందుబాటులో ఉన్నాయి.
* కేంద్రం రాష్ట్రాలకు 32,109 వెంటిలేటర్లు కేటాయించింది. వాటిలో ఏపీకి 3,960, తెలంగాణకు 1,400 వచ్చాయి. మహారాష్ట్ర (4,434) తర్వాత అత్యధిక వెంటిలేటర్లు ఆంధ్రప్రదేశ్‌కు అందాయి.
కొవిడ్‌ సమయంలో తెలంగాణకు 13.85 లక్షల ఎన్‌95 మాస్కులు, 2.41 లక్షల పీపీఈ కిట్లు కేంద్రం అందజేసింది. ఏపీకి 14.63 లక్షల ఎన్‌95 మాస్కులు, 2.79 లక్షల పీపీఈ కిట్లు అందాయి.


వ్యాక్సిన్‌ అభివృద్ధిలో...

వ్యాక్సిన్‌ అభివృద్ధి, పరీక్షల కోసం కేంద్ర ఔషధ ప్రమాణ నియంత్రణ మండలి ఏడు సంస్థలకు అనుమతి ఇచ్చింది. వాటిలో పుణెకి చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, జినోవా బయో ఫార్మాసూటికల్స్‌ లిమిటెడ్‌, హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌, బయోలాజికల్‌ ఈ లిమిటెడ్‌, అరబిందో ఫార్మా లిమిటెడ్‌, అహ్మదాబాద్‌కు చెందిన కాడిలా హెల్త్‌కేర్‌, ముంబయికి చెందిన రిలయన్స్‌ లైఫ్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఉన్నాయి. వీటిలో భారత్‌ బయోటెక్‌, కాడిలా హెల్త్‌కేర్‌ మొదటిదశ ప్రయోగాలు అద్భుతమైన ఫలితాలనిచ్చాయి.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు