close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వైనతేయుడిపై వేంకన్న తేజస్సు

కనులపండువగా గరుడోత్సవం
 శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్‌

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీనివాసుడి వాహన సేవల్లో అత్యంత ప్రాధాన్యం కలిగిన గరుడసేవ బుధవారం తిరుమలలో కనులపండువగా సాగింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా అయిదో రోజైన బుధవారం రాత్రి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో మలయప్పస్వామి గరుడ వాహనంపై దర్శనమిచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి గరుడసేవలో పాల్గొన్నారు. అంతకు ముందు బుధవారం ఉదయం మలయప్పస్వామి మోహినీ రూపంలో సర్వాలంకార భూషితుడై పల్లకిలో దర్శనమిచ్చారు. బుధవారం దిల్లీ నుంచి నేరుగా రేణిగుంట విమానాశ్రయానికి వచ్చిన సీఎం జగన్‌ అక్కడి నుంచి తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథిగృహంలో కొంతసేపు విశ్రాంతి తీసుకున్న సీఎం.. కరోనా వైరస్‌ నియంత్రణపై ప్రధాని మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో తిరుమలలోని అన్నమయ్య భవనం నుంచి పాల్గొన్నారు. అక్కడి నుంచి నేరుగా బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ అర్చకులు ఆయన తలకు వస్త్రాన్ని చుట్టారు. పట్టువస్త్రాల్ని తలపై పెట్టుకున్న ముఖ్యమంత్రి కాలినడకన శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల్ని తితిదే అధ్యక్షుడు వైెవీ సుబ్బారెడ్డి, తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌కు అందజేసి.. శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపానికి చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేయగా తితిదే ఛైర్మన్‌, ఈవో, అదనపు ఈవో తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం సీఎం 2021 సంవత్సరం క్యాలెండర్‌, డైరీలను ఆవిష్కరించారు. ఆలయం నుంచి వాహన మండపానికి చేరుకుని.. శ్రీవారి గరుడవాహన సేవలో పాల్గొన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.