close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కోలుకున్నవారే అధికం

 దేశంలో 56లక్షలు దాటిన కరోనా బాధితులు
 తొలి కేసు బయటపడి 34 వారాలు పూర్తి

దేశంలో కరోనా మహమ్మారి జాడ కనిపించి బుధవారానికి 34 వారాలు పూర్తికాగా.. ఇంతవరకు 90 వేల మందికిపైగా దీని బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 1,085 మంది చనిపోయారు. బుధవారం 83,347 కొత్తకేసులు బయటపడగా.. మొత్తం కేసుల సంఖ్య 56.46 లక్షలకు చేరింది.
ఐదో రోజూ పెరిగిన రికవరీలు
వరుసగా 5వ రోజు కొత్త కేసులకంటే కోలుకున్నవారి సంఖ్య అధికంగా నమోదైంది. బుధవారం 89,746 మంది కోలుకోవడంతో మొత్తం రికవరీల సంఖ్య 45.87 లక్షలు దాటింది. రికవరీ రేటు 81.25 శాతానికి పెరిగింది. కేసులు అధికంగా ఉన్న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌లలో రికవరీలు పెరగడంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. 17 రాష్ట్రాల్లో కొత్త కేసులకంటే రికవరీలు అధికంగా నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 9,68,377కి చేరింది.
10 రాష్ట్రాల్లో 88% మరణాలు
దేశవ్యాప్తంగా సంభవించిన కరోనా మరణాల్లో 88 శాతం 10 రాష్ట్రాల్లోనే చోటుచేసుకున్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 33,407 మంది చనిపోయారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీ, పశ్చిమబెంగాల్‌, గుజరాత్‌, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గత నెల రోజుల్లో 34,226 మంది ప్రాణాలు కోల్పోయారు. నెల క్రితం 1.87% మేర ఉన్న మరణాల రేటు ఇప్పుడు 1.59%కి చేరింది.


తొలిసారి తగ్గుముఖం

దేశంలో మహమ్మారి జాడ కనిపించిన తర్వాత వారాల లెక్కల్లో తొలిసారిగా కేసులు తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తోంది. భారత్‌లో జనవరి 30న తొలికేసు బయటపడింది. అప్పటి నుంచి బుధవారం నాటికి 34 వారాలు పూర్తయ్యాయి. కరోనా విజృంభణ మొదలైన తర్వాత ఇంతవరకు ఏ వారానికా వారం కేసులు పెరుగుతూ పోతున్నాయి. మొదటిసారిగా క్రితం వారం(ఈనెల 10 నుంచి 16)  బయటపడిన కేసుల (6,50,231) కంటే ఈ వారం(ఈనెల 17 నుంచి 23) కేసుల సంఖ్య (6,25,651) తగ్గింది. గత వారం కంటే ఈ వారంలో 24,580 కేసులు తగ్గాయి.
* కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా తగ్గింది. క్రితం వారంలో 8,176 మంది చనిపోగా, ఈ వారం 7,954 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈమేరకు మరణాల సంఖ్య 222 తగ్గింది.


6.62 కోట్ల పరీక్షలు..

దేశంలో మంగళవారం నాటికి 6.62 కోట్ల కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరిపారు. ప్రతి 10 లక్షల జనాభాకు జరుపుతున్న సగటు పరీక్షల సంఖ్య 48,028కి పెరిగింది. పాజిటివిటీ రేటు 8.52 శాతానికి చేరినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో పరీక్షల నిర్వహణ సామర్థ్యం రోజుకు 12 లక్షలకు చేరింది. మంగళవారం 9.53 లక్షల పరీక్షలు జరిపారు. కాగా క్రితం వారంతో పోలిస్తే ఈ వారం ఐసీఎంఆర్‌ నిర్వహిస్తున్న రోజువారీ పరీక్షలు 10.15% మేర తగ్గాయి.

 

 

 

- ఈనాడు - దిల్లీ, ప్రత్యేక విభాగం

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.