close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆన్‌లైన్‌లో సమస్త పౌరసేవలు

 టీఎస్‌ బీపాస్‌ చరిత్రాత్మక చట్టం
 దాని అమలుకు త్వరలో కార్యాచరణ
 ఈవోడీబీ,  టీఎస్‌బీపాస్‌లపై సమీక్షలో మంత్రి కేటీఆర్‌
ఈనాడు - హైదరాబాద్‌

తెలంగాణలో ప్రజలందరికీ ఒకే చోట సమస్త సేవలందించేందుకు పౌరసేవల నిర్వహణ (సిటిజన్‌ సర్వీసెస్‌ మేనేజ్‌మెంటు) పోర్టల్‌ను ఏర్పాటు చేస్తామని పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు ప్రకటించారు. దీని ద్వారా ఏ సేవ అయినా నేరుగా ఆన్‌లైన్‌ ద్వారా పొందవచ్చని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సులభతర వ్యాపార నిర్వహణ (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌/ఈవోడీబీ) ప్రమాణాల పెంపుదలకు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం మరిన్ని నూతన సంస్కరణలు తెస్తామని తెలిపారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వ శాఖల పనితీరులో సానుకూల మార్పులు చేస్తామన్నారు. ఆయా శాఖలు చేపడుతున్న సంస్కరణలు, కార్యక్రమాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పర్యవేక్షించేందుకు ప్రత్యేక డాష్‌ బోర్డ్‌ ఏర్పాటు  చేస్తామన్నారు. టీఎస్‌ బీపాస్‌ చరిత్రాత్మక చట్టమని, దీని ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా పౌరులకు అత్యంత సౌకర్యవంతంగా, సులభంగా, పారదర్శకంగా భవన నిర్మాణాలకు, లేఅవుట్లకు అనుమతులు ఇస్తోందన్నారు. క్షేత్రస్థాయిలో దీని అమలుపై త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.  బుధవారం ప్రగతిభవన్‌లో ఈవోడీబీ, టీఎస్‌ బీపాస్‌ చట్టంలపై సమీక్ష నిర్వహించారు.  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, పలు శాఖల అధిపతులు హాజరయ్యారు.  ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో పరిశ్రమలు, వాణిజ్యం, సేవారంగాలు కీలకమైనవి. వీటికి సంబంధించి సులభతర అనుమతులు, సేవలు కీలకం. వీటిని మరింత పెంచుతాం.  సంస్కరణలు వేగవంతంగా అమలు చేయాలి. కొన్నింటిని నెలలోనే పూర్తి చేసే విధంగా ప్రభుత్వ శాఖలు పనిచేయాలి. న్యాయ, పర్యాటక, పౌరసరఫరాలు, ఆబ్కారీ, చలనచిత్ర అభివృద్ధి సంస్థ, భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ కార్యాలయం, తదితర శాఖల  సంస్కరణలకు కార్యదర్శులు చొరవ చూపాలి. పౌరసేవా నిర్వహణ పోర్టల్‌ ఏర్పాటుకు అన్ని శాఖలు సలహాలు, సూచనలివ్వాలి. టీఎస్‌ బీపాస్‌ అమలులో వివిధ శాఖల సహకారం, సమన్వయం అవసరం. ఆ దిశగా ఇప్పటి నుంచి ఆయా శాఖలు కలిసి పనిచేయాలి. బీపాస్‌ అనుమతులకు సంబంధించి అవసరం ఉన్న ప్రతి శాఖ నుంచి ఒక్కొక్క సమన్వయ (నోడల్‌) అధికారిని  ప్రత్యేకంగా నియమించాలి’’ అని కేటీఆర్‌ సూచించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.