close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తెరాసకు 25 స్థానాలే

పాతబస్తీ బకాయిలు వసూలు చేశాకే ఓట్లు అడగాలి
ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జిషీట్‌ నేడు: భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌

ఈనాడు, హైదరాబాద్‌ : అసత్య ప్రచారాలతో గ్రేటర్‌ ఎన్నికల్లో గెలిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. తెరాసకు 25 డివిజన్లు మించి రావని సర్వేలు చెబుతున్నాయన్నారు. 25 డివిజన్లు గెలిచినా మేయర్‌ పీఠం వస్తుందని తెరాస మంత్రులనడమే ఇందుకు నిదర్శనమన్నారు. భాజపా పూర్తి మెజార్టీ సాధించబోతోందని మాట్లాడారు. తెరాస, కాంగ్రెస్‌, మజ్లిస్‌లు భాజపాను నియంత్రించలేవని..తమ పార్టీ ప్రజల నియంత్రణలోనే ఉంటుందని వ్యాఖ్యానించారు. వరదసాయం ఆపాలంటూ ఎవరి నుంచీ లేఖ రాలేదని ఎన్నికల సంఘమే స్పష్టంచేసిందని.. ఈ విషయమై ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తన పేరుతో ఫోర్జరీ సంతకం చేసిన లేఖ అంశంపై సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదుచేసి నాలుగు రోజులైనా విచారణ జరిపి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. శనివారమిక్కడ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  తెరాస గత గ్రేటర్‌ ఎన్నికల మేనిఫెస్టోను తమ వెబ్‌సైట్‌ నుంచి ఎందుకు తొలగించిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెరాస ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్ర భాజపా రూపొందించిన ఛార్జిషీట్‌ను కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ఆదివారం విడుదల చేస్తారని, త్వరలోనే మేనిఫెస్టోను కూడా వెలువరిస్తామని చెప్పారు. భాజపాను సమర్థిస్తున్న యువతను వేధించడానికే ట్రాఫిక్‌ చలాన్లు వేస్తున్నారని..ఆ మొత్తాన్ని కడతామని చెప్పామే తప్ప నిబంధనలు ఉల్లంఘించాలనడం లేదన్నారు.ట్రాఫిక్‌ వ్యవస్థను, రహదారుల్ని బాగు చేయమంటున్నామన్నారు. భాజపా అంటే తెరాసకు భయం పట్టుకుందని, ఆ పార్టీ మంత్రులు, నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ‘ఒకరు అరెస్టు చేయాలంటారు..మరొకరు భాగ్యలక్ష్మి ఆలయానికే ఎందుకు వెళ్లారంటున్నారు..దమ్ముంటే అరెస్టు చేయండి’ అని సంజయ్‌ సవాల్‌ విసిరారు. మజ్లిస్‌కు మేయర్‌ పీఠం అప్పగించేందుకు తెరాస ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించారు. నకిలీ లేఖ, ఫోర్జరీ సంతకంపై ప్రమాణం చేసేందుకు తెరాస నేతలు ఏ ఆలయానికి రమ్మంటే ఆ ఆలయానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

ముస్లింల గురించి మీరు మాట్లాడితే లేనిది...
30కోట్ల మంది ముస్లింలను దేశం నుంచి వెళ్లగొడతారా? అని సీఎం మాట్లాడితే లేని తప్పు..హైదరాబాద్‌ నుంచి హిందువుల్ని పంపిస్తారా? అని నేనంటే రెచ్చగొట్టడం ఎలా అవుతుందని సంజయ్‌ ప్రశ్నించారు. రాజధానిలో 40వేల మంది రోహింగ్యాలున్నారంటూ వారిని పంపించివేయగలరా అని నిలదీశారు. భాగ్యనగరంలో ఎందరు బంగ్లాదేశీయులు, పాకిస్థానీలు ఉన్నారో ప్రభుత్వం చెప్పాలని, వారిని ఇక్కడి నుంచి ఎందుకు పంపించట్లేదని ప్రశ్నించారు. కేంద్ర నిధుల బకాయిలపై మాట్లాడుతున్న తెరాస..ముందు పాతబస్తీలో బకాయిలు వసూలు చేయాలని..తర్వాతే ఎన్నికల్లో ఓట్లు అడగాలని డిమాండ్‌ చేశారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.