
ప్రధానాంశాలు
భాగ్యనగరం అని పెడితే బంగారం పుడుతుందా?
పేరు మార్చేవాళ్లు కావాలా.. తీరు మార్చేవారు రావాలా?
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎక్కడైనా మాట తూలామా?
రియల్ ఎస్టేట్ సమ్మిట్-2020’లో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు
జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: అభివృద్ధి, జనహితమే ఎజెండాగా వచ్చే వారిని హైదరాబాదీలు ఆదరించాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. ఆరేళ్ల ప్రగతిని చూడండి.. మమ్మల్ని ఆశీర్వదించండి అని అన్నారు. మత రాజకీయాలు చేస్తున్న వారిని హైదరాబాదీలంతా బలంగా తిప్పికొట్టాలన్నారు. క్రెడాయ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో శుక్రవారం ఇక్కడ జరిగిన ‘రియల్ ఎస్టేట్ సమ్మిట్-2020’ సదస్సులో ఆయన మాట్లాడారు. నాలుగు ఓట్ల కోసం, నాలుగు సీట్ల కోసం నగరానికి అగ్గిపెట్టి వెళ్తే తరువాత దానిని ఎవరు ఆర్పుతారు? అని ప్రశ్నించారు. ఒక వర్గాన్ని, ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకొని చేసే ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. భాజపా నాయకులు హైదరాబాద్ పేరు మారుస్తాం అంటున్నారు. భాగ్యనగరం అని పేరు పెడితే బంగారం అవుతుందా.. ఆలోచించండి. నేమ్ ఛేంజర్ కావాలా..! గేమ్ ఛేంజర్ కావాలా? రాష్ట్ర ఆవిర్భావానికి ముందు చాలా ఉద్వేగంగా ఉన్నాం.. అనంతరం ఎక్కడైనా మాట తూలామా? అని ప్రశ్నించారు. ఆరేళ్ల మా ప్రభుత్వ ఆచరణ మీ ముందుంది. అభివృద్ధి కావాలో ఆరాచకం కావాలో తేల్చుకోండన్నారు. హైదరాబాద్‌లో ఏదైనా కార్యాలయం ఏర్పాటుకు అవసరమయ్యే స్థలం ధర.. బెంగళూరులో రెండింతలు పెరిగితే మన నగరంలో నాలుగింతలు పెరిగిందని అని తెలిపారు.
కొన్నాళ్లు పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు
తెరాస ప్రభుత్వం వచ్చాక కొత్త మున్సిపల్, పంచాయతీరాజ్, రెవెన్యూ చట్టాలను, టీఎస్ ఐపాస్, టీఎస్ బీపాస్ సీఎం తెచ్చారు. ఇవన్నీ జవాబుదారీతనం, పారదర్శకత, సమయానికి అందించేలా తీర్చిదిద్దారు. ఇటీవలి మార్పుల వల్ల వ్యవసాయేతర భూముల విషయంలో ఇబ్బందులున్నాయి. వాస్తవానికి ధరణి ఈనెల 25న ప్రారంభం అవుతుందనుకున్నా కొన్ని సమస్యల వల్ల కాలేదు. ఒక పెద్ద సంస్కరణ, మార్పు చేసేటప్పుడు ఇవన్నీ తాత్కాలికమని, త్వరలోనే ఇది అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఒకవేళ ఇబ్బంది అలానే ఉంటే తాత్కాలికంగా పాతపద్ధతిని కొనసాగించాలని సీఎంను కోరతానన్నారు. ముఖ్యమంత్రి వ్యవసాయ భూములకు ఆకుపచ్చ పాస్‌బుక్, వ్యవసాయేతర భూములకు మెరూన్ పాస్‌బుక్ అందించాలనుకుంటున్నారని అన్నారు. ప్రజల మీద భారం వేయకుండా ఆస్తులను రెగ్యులరైజ్ చేస్తే యజమానికి హక్కు, విలువ తెలియడంతోపాటు ప్రభుత్వానికి పన్ను వస్తుందన్నారు. డిజిటల్ సర్వే ద్వారా తెలంగాణలోని ప్రతి అంగుళం భూమిని మ్యాపింగ్ చేయబోతున్నామని దీనివల్ల భూముల పంచాయితీలు, కబ్జాలు, రెండు, మూడుసార్లు రిజిస్ట్రేషన్లు ఉండవని చెప్పారు.
నాలాలు, చెరువులు, మూసీతో అనుసంధానం
జవహర్‌నగర్‌లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేశామని, ప్యారేనగర్, లక్డారంలో రెండు డంపింగ్ యార్డులు ఏర్పాటు చేస్తామని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌కు ఇంకెప్పుడూ వరదలతో ఇబ్బంది రాకుండా నాలాలు, చెరువులు, మూసీని కలిపి రాబోయే మూడేళ్లలో వ్యూహాత్మక పథకం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షులు రామకృష్ణారావు, ట్రెడా అధ్యక్షులు చలపతిరావు, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు సి.ప్రభాకర్‌రావు, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జి.వి.రావు, క్రెడాయ్ ప్రధాన కార్యదర్శి వి.రాజశేఖర్‌రెడ్డి, ట్రెడా ప్రధాన కార్యదర్శి సునీల్, టీబీఎఫ్ ఉపాధ్యక్షులు జె.టి.వి విద్యాసాగర్, క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షులు రామచంద్రారెడ్డి, టీడీఏ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసగౌడ్, నార్డెకో కన్వీనర్ పీఎస్ రెడ్డి, క్రెడాయ్ ఈసీ సభ్యులు ప్రదీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- ‘బిడ్డలిద్దరూ శివపార్వతులు.. నేను కాళికను’
- దోచుకున్న నాలుగు గంటలకే దొరికేశారు
- RRR రిలీజ్.. ఇది అన్యాయం: బోనీకపూర్
- అక్కాచెల్లెళ్ల మరణానికి ఆ నమ్మకమే కారణమా?
- 21 ఏళ్లకే వ్యాపార పాఠాలు!
- థాంక్యూ.. టీమ్ఇండియా అంటున్న లైయన్
- అచ్యుతానందగిరి స్వామి దారుణ హత్య
- మదనపల్లె కేసు: రిమాండ్ రిపోర్ట్‌లో కీలకాంశాలు
- ముంబయిని కేంద్రపాలిత ప్రాంతం చేయండి
- వెజ్ బఫె రూ.500, నాన్‌వెజ్ బఫె రూ.700