సెంట్రల్‌ విస్టా నిర్మాణం దేశానికి గర్వకారణం

ప్రధానాంశాలు

సెంట్రల్‌ విస్టా నిర్మాణం దేశానికి గర్వకారణం

శంకుస్థాపన సందర్భంగా ప్రధానికి సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: దేశ రాజధానిలో నూతన పార్లమెంట్‌ భవనం, కేంద్ర మంత్రిత్వ శాఖల భవనాల నిర్మాణానికి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేయబోతున్న ‘సెంట్రల్‌ విస్టా’ ప్రాజెక్టు దేశానికి గర్వకారణంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. సెంట్రల్‌ విస్టాకు గురువారం శంకుస్థాపన చేయబోతున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు బుధవారం ప్రధానికి లేఖ రాశారు. ‘‘దేశ రాజధానిలోని ప్రస్తుత ప్రభుత్వ కార్యాలయాల సముదాయం అవసరాలకు తగినట్లుగా లేదు. అది వలస పాలనకు గుర్తుగా ఉంది. దిల్లీలో ఇలాంటి నిర్మాణం అవసరం ఎప్పటి నుంచో ఉంది. సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు ఆత్మగౌరవానికి, ప్రతిష్ఠకు, పునరుజ్జీవనానికి, పటిష్ఠమైన భారతదేశానికి చిహ్నంగా నిలుస్తుంది. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి కావాలి’’ అని లేఖలో కేసీఆర్‌ ఆకాంక్షించారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని