
ప్రధానాంశాలు
బర్డ్‌ఫ్లూపై ఆందోళన చెందనక్కర్లేదు
తెలంగాణకు ఏటా 427 రకాల పక్షి జాతుల రాక
‘ఈనాడు’తో రాష్ట్ర బయో డైవర్సిటీ బోర్డు సభ్యుడు ప్రొ.సి.శ్రీనివాసులు
ఈనాడు, హైదరాబాద్: ‘‘ఈసారి తెలంగాణకు వలస పక్షులు చాలావరకు రాలేదు. గత రెండు, మూడేళ్లుగా వాటి సంఖ్య తగ్గింది. హైదరాబాద్ శివారులోని అమీన్పూర్ చెరువు వద్దకు పెంగ్విన్ పక్షులు వచ్చినా, పెద్ద సంఖ్యలో లేవు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌కు వలస పక్షులు కాస్త ఎక్కువగా వచ్చాయని తెలిసింది. బర్డ్‌ఫ్లూ కేసులు కొన్ని రాష్ట్రాల్లోనే కనిపిస్తున్నాయి. మనకు సమీపంలో ఒడిశాలో కేసులు నమోదవ్వగా, మళ్లీ కేరళలోనే కనిపించాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎక్కడా బర్డ్‌ఫ్లూకు సంబంధించి కేసులు నిర్ధారణ కాలేదు. ఈసారి పక్షుల రాక ఎక్కువగా లేనందున బర్డ్‌ఫ్లూ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని రాష్ట్ర బయో డైవర్సిటీ బోర్డు సభ్యుడు, ఉస్మానియా జంతుశాస్త్ర ఆచార్యుడు ప్రొ.సి.శ్రీనివాసులు తెలిపారు. దేశంలో బర్డ్‌ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలోని పరిస్థితులపై ఆయన ‘ఈనాడు’తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
‘‘ఏటా తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు 425-427 పక్షి జాతులు వలస వస్తున్నట్లు గుర్తించాం. వీటిల్లో 80 శాతం శీతాకాలంలోనే వస్తాయి. ఈ కాలంలో ప్రధానంగా చైనా, సైబీరియా, మంగోలియా, రష్యా నుంచి పక్షుల వలసలు సాగుతుంటాయి. యూరోపియన్ దేశాల నుంచి కొంతమేర వలసలు ఉంటాయి. వేసవిలో మాత్రం ఆఫ్రికా నుంచి వస్తాయి. ఈ ఏడాది వలస పక్షులు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ప్రాంతాల్లోనే కనిపిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా నిఘా అవసరం ఉంది. హైదరాబాద్ చుట్టు పక్కల మంజీరా డ్యాం, అమీన్పూర్, పోచారం, శామీర్‌పేట, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ ప్రాంతాలకు పక్షుల వలసలు ఎక్కువగా ఉండేవి.
రెండు మార్గాల్లో ప్రవేశం
వలస పక్షులు ఎక్కువగా రష్యా, సైబీరియా, చైనాల నుంచి హిమాలయాల మీదుగా భారత్‌లోకి వస్తాయి. ఇందుకు రెండు ఎగిరే మార్గాలు(ఫ్లై వే) ఉన్నాయి. ఒకటి ఈశాన్యం నుంచి. మరొకటి వాయువ్యం. దేశంలో తొలుత బర్డ్‌ఫ్లూ కేసులు హిమాచల్‌ప్రదేశ్‌లోని రాజహంస జాతికి చెందిన తెల్ల పెద్ద బాతుల్లో(బార్‌హెడెడ్) కనిపించింది. ఇవి ఎక్కువగా లద్దాఖ్ ప్రాంతంలో పొదుగుతుంటాయి. కొన్ని అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటాయి. మరికొన్ని చైనా, సైబీరియా నుంచి వలస వస్తాయి. ప్రస్తుతం ఈ బర్డ్‌ఫ్లూ లద్దాఖ్ వద్దనే ప్రబలిందా.. లేదా ఇతర దేశాల నుంచి వచ్చిన పక్షుల ద్వారా వచ్చిందా తెలియాల్సి ఉంది.
రాష్ట్ర స్థాయిలో సర్వైలెన్స్ అవసరం
ప్రస్తుతం వైరస్ గుర్తింపు నమూనాల విశ్లేషణ జబల్పుర్, భోపాల్‌లోనే ఉంది. భవిష్యత్తులో ప్రతి రాష్ట్రంలో ఎలాంటి వైరస్ అయినా సరే గుర్తించేలా సర్వైలెన్స్ ఉండాలి. అవసరమైన ప్రయోగశాలలు అందుబాటులోకి రావాలి. ఇది జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో జరిగేలా విధానంగా మారాలి. భవిష్యత్తులో వాతావరణ మార్పుల కారణంగా కొత్త వైరస్లు పుట్టుకొచ్చే వీలుంది. దీన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర స్థాయిలోనూ ప్రత్యేక వ్యవస్థ ఉండాలి. ఏ తరహా వైరస్ కేసులు వస్తున్నాయో, జంతువులు నుంచి ఎలాంటివి వ్యాపిస్తున్నాయో తెలుసుకునేలా ప్రత్యేక ప్రణాళిక ఉండాలి.’
ప్రధానాంశాలు
దేవతార్చన

- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
- అలా చేస్తే భారత్‌దే విజయం: గావస్కర్
- ప్చ్.. ఆధిపత్యానికి వరుణుడు బ్రేక్!
- మహా నిర్లక్ష్యం
- ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు