
ప్రధానాంశాలు
రోగ నిరోధక వ్యవస్థకు జ్ఞప్తి ఎక్కువ
వైరస్‌ను పసిగట్టగానే పోరాడుతుంది
ఏఐజీ శ్వాసకోశ వైద్యనిపుణులు డాక్టర్ విశ్వనాథ్ గెల్లా
కరోనా టీకా వచ్చేసింది.. వైరస్‌ను ఎదుర్కొనేందుకు పెద్ద అండ దొరికింది. ఇప్పుడు అందరి మదిలోనూ ఇదే భరోసా! వ్యాక్సిన్ తీసుకున్నాక అది ఎలా పనిచేస్తుంది? వైరస్‌ను ఎదుర్కొనే శక్తిని ఎలా ఇస్తుంది అనే వివరాలు అత్యంత ఆసక్తికరం. సాధారణంగా ఏ టీకాను తీసుకున్నా.. సంబంధిత వైరస్, బ్యాక్టీరియాలను సమర్థంగా ఎదుర్కొనే రోగ నిరోధక వ్యవస్థను అది బలోపేతం చేస్తుంది. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థకు జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ. కొన్నేళ్ల తర్వాత వైరస్, బ్యాక్టీరియాలు శరీరంలోకి ప్రవేశించినా.. రోగ నిరోధక వ్యవస్థలో నిక్షిప్తమై ఉన్న కణాలు వాటికి వ్యతిరేకంగా పోరాడి, నాశనం చేస్తాయి. ఇది అన్ని రకాల టీకాల్లోనూ జరిగే ప్రక్రియ. కొత్తగా వచ్చిన కొవిడ్ టీకాల పని తీరూ ఇలాగే ఉంటుందని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) చెందిన ప్రముఖ శ్వాసకోశ వైద్యనిపుణులు డాక్టర్ విశ్వనాథ్ గెల్లా తెలిపారు.కొవిషీల్డ్ టీకా
* కరోనా వైరస్‌లోని ‘స్పైక్ ప్రొటీన్’ జన్యుక్రమాన్ని విడదీస్తారు.
* వెలుపలికి తీసిన ‘స్పైక్ ప్రొటీన్’ను శరీరంలోకి పంపేందుకు ‘ఎడినో వైరస్’ను ఒక వాహకంగా ఉపయోగిస్తారు.
* చింపాజీల్లో శ్వాసకోశ ఇన్ఫెక్షన్కు కారణమయ్యే ఈ వైరస్‌ను బలహీనపరచి స్పైక్ ప్రొటీన్‌తో కలిపి టీకా రూపంలో మన శరీరంలోకి పంపిస్తారు.* బలహీనపరుస్తారు కాబట్టి ఎడినో వైరస్ శరీరంలోకి వెళ్లినా ఎటువంటి హాని కలగజేయదు.
* ‘ఎడినోవైరస్’, ‘స్పైక్ ప్రోటీన్’ సమ్మిళిత మిశ్రమాన్ని టీకా రూపంలో 0.5 మి.లీ. ఇంజక్షన్ ద్వారా కండరానికి ఇస్తారు.* ‘స్పైక్ ప్రొటీన్ లోపలికి చేరగానే శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ గుర్తిస్తుంది. దీన్ని ఎదుర్కొవడానికి యాంటీబాడీస్‌ను ఉత్పత్తి చేస్తుంది.
* ఇక ఆ తర్వాత ఎప్పుడైనా మన మీద వైరస్ దాడి చేసి దాని స్పైక్ ప్రొటీన్ శరీరంలోకి ప్రవేశించినా.. దాని గురించి ముందే తెలిసి ఉండడం వల్ల.. శరీరం అందుకు అనుగుణంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుంటుంది.
కొవాగ్జిన్ టీకా
* నిర్జీవ కరోనా వైరస్ (ఇనాక్టివేటెడ్ వైరస్)తో తయారుచేసిన ఈ టీకాను 0.5 మి.లీ. డోసులో కండరాల్లోకి ఇంజక్షన్ ద్వారా పంపిస్తారు.* స్పైక్ ప్రొటీన్ శరీరంలోకి ప్రవేశించగానే.. రోగ నిరోధక వ్యవస్థలోని సీడీ 4, సీడీ 8, బి, టి లింఫోసైట్స్కు సమాచారం అందుతుంది.
* అవి స్పైక్ ప్రొటీన్‌కు వ్యతిరేకంగా యాంటీబాడీస్‌ను ఉత్పత్తి చేయడంతోపాటు వైరస్‌కు సంబంధించిన ఇతర యాంటీజెన్లను గుర్తించి వాటికి వ్యతిరేకంగా కూడా యాంటీబాడీస్‌ను ఉత్పత్తి చేస్తుంది.
* తర్వాత ఎప్పుడైనా వైరస్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు.. రోగ నిరోధక కణాలు అతి వేగంగా స్పందిస్తాయి.
* త్వరితగతిన కరోనా వైరస్‌ను నాశనం చేస్తాయి.
‘‘కొవిడ్ టీకాను తీసుకున్న తర్వాత.. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా మనలోని రోగ నిరోధక శక్తి టి-లింఫోసైట్స్, బి-లింఫోసైట్స్‌ను ప్రేరేపిస్తుంది. తద్వారా వైరస్‌పై ఉన్న స్పైక్ ప్రొటీన్‌కు వ్యతిరేకంగా యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి. అవి ఆ వైరస్‌ను నాశనం చేయడానికి పోరాడుతాయి. వైరస్ మన కణాల అంతర్భాగంలోకి చేరకుండా అడ్డుపడతాయి’’
- డాక్టర్ విశ్వనాథ్
ప్రధానాంశాలు
దేవతార్చన

- Curfew: తెలంగాణలో నేటి నుంచి రాత్రి వేళ!
- మీ పేరుపై ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో తెలుసుకోండి
- తొలుత జ్వరం అనుకుని.. చివరి నిమిషంలో మేల్కొని..
- కొవిడ్-19 ఎందుకింత ఉద్ధృతం?ఎప్పుడు ప్రమాదకరం?
- Corona Vaccine : 44 లక్షల డోసులు వృథా
- Horoscope: ఈ రోజు రాశి ఫలం
- భారత్‌లో వ్యాక్సిన్లకు అమెరికా అడ్డుపుల్ల..!
- కార్చిచ్చులా కరోనా
- India Corona: కాస్త తగ్గిన కొత్త కేసులు
- ఆ డేటా ఫోన్లో ఉంటే డిలీట్ చేయండి: ఎస్బీఐ