
ప్రధానాంశాలు
త్రిసభ్య కమిటీకి సీఎం ఆదేశాలు
వారం, పదిరోజుల్లో పూర్తి చేయాలి
నెలాఖరు నాటికిఖాళీల వివరాలు ఇవ్వాలి
ఆ వెంటనే ఉద్యోగ ప్రకటనలు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ(పీఆర్సీ), పదోన్నతులు సహా ఇతర అంశాలు, సమస్యలపై ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, రజత్‌కుమార్‌ల ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. వారం, పది రోజుల్లో ప్రక్రియను పూర్తిచేయాలని చెప్పారు. ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎంతో త్రిసభ్య కమిటీ భేటీ అయింది. పీఆర్సీతో పాటు పదోన్నతుల ప్రక్రియ, కారుణ్య నియామకాలు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ప్రయోజనాలు తదితరాలపై నివేదిక ఇచ్చారు. వాటి పురోగతిని సీఎం సమీక్షించారు. ఉద్యోగ సంఘాల నేతలతో చర్చల అనంతరం పరిస్థితిని సమీక్షించి, తనకు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
పదోన్నతులు పారదర్శకంగా జరగాలి
పదోన్నతుల ప్రక్రియ తీరుపై తమకు ఉద్యోగుల నుంచి వచ్చిన సమాచారానికి సంబంధించిన అంశాల గురించి సీఎం చర్చించారు. ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, వీలైనంత ఎక్కువ మందికి పదోన్నతులు కల్పించాలని, ఏ ఒక్కరికీ అన్యాయం జరగరాదన్నారు. రోస్టర్ పేరిట హైదరాబాద్ జలమండలి మరికొన్ని విభాగాల్లో కొందరికి పదోన్నతులు నిలిపివేసిన అంశం గురించి సీఎం ప్రస్తావించారు. అర్హులందరికీ పదోన్నతులిచ్చి, ఖాళీలకు అనుగుణంగా నియామకాలు చేపట్టాలన్నారు.
నెలాఖరుకల్లా ఖాళీల వివరాలు
పదోన్నతుల ప్రక్రియ నెలాఖరుకు ముగియాలని, ఆ వెంటనే అన్ని శాఖల్లో ఖాళీల వివరాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. సమాచారం వచ్చిన వెంటనే ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేయాలన్నారు. ఖాళీల సమాచారాన్ని, ఉద్యోగ నియామకాలను అత్యంత ప్రాధాన్యాంశాలుగా పరిగణించాలని చెప్పారు. వారం గడువు ఉన్నందున అన్ని శాఖలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని సీఎం సూచించారు.
గణతంత్ర ఉత్సవాల తర్వాత
26న గణతంత్ర దినోత్సవం దృష్ట్యా యంత్రాంగం ఆ ఏర్పాట్లలో ఉంది. అవి ముగిశాక ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు జరపాలని త్రిసభ్య కమిటీ భావిస్తోంది. సోమవారం లేదా 27న ఉద్యోగ సంఘాలకు త్రిసభ్య కమిటీ ఆహ్వానాలు పంపనుంది. అన్నింటితో ఒకేసారి కాకుండా ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలతో విడివిడిగా చర్చలకు అవకాశం ఉన్నట్లు తెలిసింది.
ప్రధానాంశాలు
దేవతార్చన

- 40 రోజులు.. రూ.40 లక్షల అద్దె!
- థ్యాంక్స్ చెప్పిన జెస్సీ.. ఉల్లి తరిగిన ఊర్వశి
- మొతేరా పిచ్: కోహ్లీతో విభేదించిన కుక్
- రివ్యూ: చెక్
- మీ అసలు స్వభావాన్ని గుర్తుచేసుకోండి!
- ఇలాంటి వారివల్లే కరోనా కేసులు పెరిగేది!
- భారత్ విజయంపై బ్రిటిష్ మీడియా అక్కసు
- టీమ్ఇండియా ఇలా చేయదు కదా..!
- ‘మొతేరా’ విజయ రహస్యం చెప్పిన అజ్జూభాయ్!
- జీవితం ఒక్క ‘క్షణం’లో మారొచ్చు..!