
ప్రధానాంశాలు
భార్యను కత్తితో నరికి చంపి... భర్త ఆత్మహత్య
క్షణికావేశం.. వృద్ధ దంపతుల విషాదాంతం
తల్లాడ, న్యూస్‌టుడే: ఒకరికొకరు తోడునీడగా కాలం వెళ్లదీయాల్సిన వృద్ధ దంపతుల జీవితాలు విషాదాంతమయ్యాయి. అమెరికా వెళ్లే విషయంలో తలెత్తిన మనస్పర్ధలు ఆ ఇద్దరినీ బలిగొన్నాయి.ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రంగంబంజర గ్రామానికి చెందిన సంక్రాంతి సుబ్రమణ్యేశ్వరరావు (65) తన భార్య విజయలక్ష్మి (60)ని క్షణికావేశంలో కత్తితో నరికి చంపాడు. అనంతరం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.బుధవారం ఉదయం ఈ విషాదం వెలుగుచూసింది. సంక్రాంతి సుబ్రమణ్యేశ్వరరావుకు విజయలక్ష్మితో సుమారు 45 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. 30 ఏళ్ల క్రితం కృష్ణా జిల్లా పెద్దపాలపర్రు నుంచి ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రంగంబంజర గ్రామానికి వలస వచ్చి స్థిరపడ్డారు. పెద్దకుమార్తె సరిత రామగుండంలో ఉంటున్నారు. చిన్నకుమార్తె సునీత అమెరికాలో స్టాప్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. అమెరికాలో ఉంటున్న సునీత వద్దకు విజయలక్ష్మి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈనెల 5న హైదరాబాద్‌లో వీసా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది. వీసా రెన్యువల్ అయితే ఈనెల 15న, లేదా 21న అమెరికా వెళ్లాల్సి ఉండేది. ఈ దశలో అమెరికా వెళ్లే విషయమై భార్యభర్తల మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. భర్త సుబ్రమణ్యేశ్వరరావు ఇప్పుడే వద్దు తర్వాత వెళ్లవచ్చని చెప్పబోగా ఆమె వినలేదు. దీంతో ఆయన క్షణికావేశంలో భార్య విజయలక్ష్మిని కత్తితో మెడపై నరికి హత్య చేశాడు. అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం పాలు పోసేందుకు వీరి ఇంటికి వెళ్లిన వ్యక్తి కొన ఊపిరితో అపస్మారక స్థితిలో ఉన్న సుబ్రమణ్యేశ్వరరావును చూసి స్థానికులకు సమాచారం అందించారు. 108 వాహనంలో కల్లూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో ఆయన మృతి చెందాడు. వైరా సీఐ వసంత్‌కుమార్ కేసు నమోదు చేసి మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- ‘వకీల్ సాబ్’కు మహేశ్‌బాబు ప్రశంసలు
- హోం క్వారంటైన్లో పవన్
- తక్కువ ఖర్చుతో వినూత్న ఇల్లు
- పవన్.. మీకు ఈ మాట చెప్పమన్నారు: దిల్‌రాజు
- ఉప్పెన.. కృతి ఇంత కష్టపడిందా!
- అదే టిప్పర్.. అదే డ్రైవర్
- ప్చ్.. ఇది వాళ్ల వ్యక్తిగతం
- మెహ్రీన్ లవ్ ప్రపోజ్.. నజ్రియా దాగుడుమూతలు
- మా కరోనా టీకాలకు అంత సీన్ లేదు!
- టిక్‌టాక్ టోనీ ఆత్మహత్య