
ప్రధానాంశాలు
కరోనా కట్టడికి పలు చర్యలు
దిల్లీ, గుజరాత్‌లలో కర్ఫ్యూ
ముంబయి బీచ్‌ల మూసివేత
దిల్లీ: కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో భారత్ క్రమక్రమంగా ఆంక్షల చట్రంలోకి జారుకుంటోంది. కొవిడ్-19 కట్టడికి దేశంలోని వివిధ రాష్ట్రాలు అనేక కట్టడి చర్యలు చేపడుతున్నాయి. దిల్లీ సర్కారు మంగళవారం నుంచి (తక్షణ వర్తింపుతో) ఈ నెల 30వ తేదీ వరకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. గర్భిణులు, రోగులు, విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్ట్స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించేవారు తదితర వర్గాల వారికి మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించింది.
* చండీగఢ్‌లో కూడా రాత్రి పది నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. బుధవారం నుంచి కర్ఫ్యూ అమల్లోకి రానుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్ సహా 20 నగరాల్లో బుధవారం నుంచి ఈ నెల 30 వరకు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
* వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ముంబయి నగర పాలక సంస్థ మంగళవారం మార్గదర్శకాలు జారీచేసింది. వీటి ప్రకారం ఏదైనా హౌసింగ్ సొసైటీలో అయిదుగురికి మంచి బాధితులు ఉంటే ఆ భవనం ప్రాంతాన్ని సూక్ష్మ కంటెయిన్మెంట్ జోన్‌గా ప్రకటిస్తారు. రాకపోకలను నిషేధిస్తారు. మార్గదర్శకాలను ఉల్లంఘించిన హౌసింగ్ సొసైటీకి తొలిసారి రూ.10,000 జరిమానా విధిస్తామని, రెండోసారీ ఉల్లంఘిస్తే రూ.20,000 చెల్లించాల్సి ఉంటుందని బృహన్ ముంబయి నగరపాలక సంస్థ (బీఎంసీ) స్పష్టంచేసింది. కొవిడ్-19 కేసులకు సంబంధించి సందర్శకులకు కనిపించేలా ప్రతి సొసైటీ బోర్డును ప్రదర్శించాలని కోరింది. ఈ నెల 30 వరకు ముంబయిలోని అన్ని బీచ్‌లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
పెరిగిన క్రియాశీలక కేసులు
తాజాగా 96,982 మందికి కొవిడ్
446 మంది మృతి
దిల్లీ: దేశంలో కరోనా కేసుల జోరు తగ్గడం లేదు. తాజాగా సోమవారం ఒక్క రోజే 96,982 మంది కొవిడ్-19 బారిన పడగా, 446 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 1,26,86,049కి, మరణించిన వారి సంఖ్య 1,65,547కు చేరింది. క్రియాశీలక కేసుల్లో వరుసగా 27వ రోజూ పెరుగుదల చోటుచేసుకుని ఆ సంఖ్య 7,88,223కు చేరింది. మొత్తం కేసుల్లో వీటి వాటా 6.21%గా ఉంది. వైరస్ నుంచి బయటపడిన వారి శాతం 92.48 శాతానికి పడిపోయింది. ఈ నెల 5వ తేదీ వరకు 25,02,31,269 నమూనాలను పరీక్షించామని, ఒక్క సోమవారమే 12,11,612 పరీక్షలు చేశామని భారత వైద్య పరిశోధన మండలి మంగళవారం వెల్లడించింది. తాజాగా 446 మరణాల్లో ఒక్క మహారాష్ట్ర నుంచే 155 ఉన్నాయి.
అవసరమైన వారికే టీకా
దేశంలో 18 ఏళ్లు దాటిన పౌరులు అందరికీ కరోనా టీకాలు వేయాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్న తరుణంలో కేంద్రం మంగళవారం స్పందించింది. వ్యాధికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నవారిని రక్షించడమే తమ తొలి ప్రాధాన్యమని తెలిపింది. ‘‘కోరుకున్న వారికి టీకాలు వేయం.. అవసరమైన వారికే వేస్తాం’’ అని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ విలేకరులతో మాట్లాడారు. పాశ్చాత్య దేశాల్లో సైతం దశల వారీగా టీకాలు వేస్తున్న సంగతిని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ‘‘కరోనా మరణాలను టీకాల ద్వారా సాధ్యమైనంతగా తగ్గించడమే లక్ష్యం. ఆరోగ్య వ్యవస్థను కాపాడడం మరో లక్ష్యం’’ అని స్పష్టంచేశారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- ఓటీటీలో ‘వకీల్‌సాబ్’: స్పష్టత ఇచ్చిన చిత్ర బృందం
- పంజాబ్ భల్లే భల్లే..
- ఓడిపోయానని భావించిన క్షణమే మలుపుతిరిగింది..
- ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
- అనుపమ కోపం.. జెనీలియా అల్లరి.. తమన్నా సెల్ఫీ
- అక్షయ్ క్షేమంగా ఉన్నారు: ట్వింకిల్
- #ఎన్టీఆర్30: కొరటాలతో మరో మూవీ ఫిక్స్
- తిరుపతి తెదేపా సభలో రాళ్లదాడి
- రజనీకాంత్ ‘అన్నాత్తే’ వర్కింగ్ స్టిల్ వైరల్
- కొవిడ్ కేర్ సెంటర్లుగా స్టార్ హోటళ్లు..!