close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
1 నుంచి ఇంటర్‌ పరీక్షలు అనుమానమే?

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా కేసులు పెరుగుతున్నందున మే 1 నుంచి జరగాల్సిన ఇంటర్‌ పరీక్షలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 9.50 లక్షల మంది పరీక్షలు రాయాల్సి ఉంది. పరీక్షా కేంద్రాల వద్ద, కేంద్రాలకు వచ్చే సమయంలో భౌతిక దూరం పాటించడం కష్టమవుతుందని అధికారవర్గాలు భావిస్తున్నాయి. అంతేకాకుండా కేవలం 40 రోజులపాటు ప్రత్యక్ష తరగతులు జరిపి వార్షిక పరీక్షలు నిర్వహించడంపై తల్లిదండ్రులు, సంఘాల నుంచిప్రశ్నలు తలెత్తుతున్నాయి. పరిస్థితులు అనుకూలించకపోతే ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు వాయిదా వేయాలని, రెండో ఏడాది వరకు జరిపేఅవకాశాలను పరిశీలించాలన్న దిశగా ఇంటర్‌ బోర్డులో చర్చ నడుస్తున్నట్లు సమాచారం. మరో 10రోజులు గడిస్తే పూర్తి స్పష్టత వస్తుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు