close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అంతటా విస్తరిస్తున్న ఆంక్షలు

  పంజాబ్‌లో 30 వరకు రాత్రి కర్ఫ్యూ
 మధ్యప్రదేశ్‌లో వారానికి 5 రోజులే ప్రభుత్వ కార్యాలయాలు
  రాయ్‌పుర్‌లో సంపూర్ణ లాక్‌డౌన్‌
  బెంగళూరులో ఈతకొలనులు, వ్యాయామశాలల నిషేధం

చండీగఢ్‌, భోపాల్‌, దిల్లీ: కొండలా పెరిగిపోతున్న కరోనా కేసులకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా దేశంలోని వివిధ రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ నెల 30 వరకు పంజాబ్‌ అంతటా రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌ బుధవారం ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లోని పట్టణ ప్రాంతాల్లో గురువారం మొదలు రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రానున్న మూడు నెలలు ప్రభుత్వ కార్యాలయాలు వారానికి ఐదు రోజులే పనిచేయనున్నట్లు వెల్లడించింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ప్రతి ఆదివారం పట్టణ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ అమలు చేస్తామని, ఛింద్వాఢా జిల్లాలో గురువారం నుంచి వారం రోజులపాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ అమలవుతుందని చెప్పింది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌ జిల్లాలో ఈ నెల 9 నుంచి 19 వరకు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రాత్రి పూట కర్ఫ్యూ నేపథ్యంలో బుధవారం దిల్లీ రైల్వేస్టేషన్‌ వద్ద ప్రయాణికుల భారీ వరుసలు కనిపించాయి. బెంగళూరు అపార్ట్‌మెంట్‌లలో ఉండే ఈతకొలనులు, వ్యాయామశాలలు, కల్యాణ మండపాలు, ఇతర సదుపాయాల వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు నగర పోలీసులు ఓ ప్రకటన జారీ చేశారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు