close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా సుశీల్‌ చంద్ర!

దిల్లీ: దేశ నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ)గా సుశీల్‌ చంద్ర నియమితులు కానున్నారు. కేంద్ర ఎన్నికల సంఘంలోని కమిషనర్లలో సీనియర్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమించడం ఆనవాయితీ. దీనిని అనుసరించి ప్రస్తుతం కమిషనర్‌గా ఉన్న సుశీల్‌ చంద్రను సీఈసీగా నియమించడానికి కేంద్ర ప్రభుత్వం సమ్మతి తెలిపినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఏ క్షణంలోనైనా ఉత్తర్వులు జారీ కావచ్చని తెలుస్తోంది. ప్రస్తుత సీఈసీ సునీల్‌ అరోడా పదవీ కాలం ఈ నెల 12తో ముగియనుంది. అరోడా స్థానంలో సుశీల్‌ ఈ నెల 13న పదవీ బాధ్యతలు చేపడతారు.  వచ్చే ఏడాది మే 14 తేదీ వరకు ఆ పదవిలో కొనసాగుతారు. సుశీల్‌ చంద్ర నేతృత్వంలోనే గోవా, మణిపుర్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల సంఘం కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు సుశీల్‌ చంద్ర కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి ఛైర్మన్‌గా ఉన్నారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు