close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సర్వ దర్శనం టైమ్‌స్లాట్‌ టోకెన్ల జారీ నిలిపివేత

తిరుమల, న్యూస్‌టుడే: కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో తితిదే శ్రీవారి ఉచిత సర్వ దర్శనం టైమ్‌స్లాట్‌ టోకెన్ల జారీని ఆదివారం సాయంత్రం నిలిపివేసింది. సోమవారం నుంచి తిరుపతిలోని విష్ణు నివాసం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో ఉచిత సర్వ దర్శనం టైమ్‌స్లాట్‌ టోకెన్లు జారీ చేయడం లేదని పేర్కొంది. ఆన్‌లైన్‌లో ఏప్రిల్‌ నెలకి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, వర్చువల్‌ సేవ, శ్రీవాణి ట్రస్టు, వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లు కలిగిన భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తామని వెల్లడించింది.
  శ్రీవారి ఆలయంలో రేపు ఉగాది ఆస్థానం
శ్రీవారి ఆలయంలో మంగళవారం శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జరగనుంది. ముందుగా ఉదయం 3.00 గంటలకు సుప్రభాతం నిర్వహించి అనంతరం ఆలయ శుద్ధి చేస్తారు. తర్వాత శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపజేస్తారు. అనంతరం పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవ (వర్చువల్‌ విధానం)లైన కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలను తితిదే రద్దు చేసింది.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు