close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పగబట్టి.. ఆరుగురిని మట్టుపెట్టి..

కుమార్తెకు అన్యాయం జరిగిందనే  కక్షతో దారుణ హత్యలు
మృతుల్లో ఆరు నెలలు, నాలుగేళ్ల చిన్నారులు
విశాఖ జిల్లాలో తెల్లవారే ఏరులై పారిన రక్తం

ఈనాడు, విశాఖపట్నం, న్యూస్‌టుడే, పెందుర్తి: తన కుమార్తెకు అన్యాయం జరిగిందన్న కోపంతో.. విశాఖ జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని ఓ వ్యక్తి అత్యంత పాశవికంగా నరికి హతమార్చాడు. ఇద్దరు చిన్నారులు సహా ప్రతి ఒక్కరినీ నిందితుడు నరికేశాడు. పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి...
విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడ గ్రామానికి చెందిన బమ్మిడి రమణ (57) కుమారుడు విజయ్‌కిరణ్‌ వల్ల తన కుమార్తెకు అన్యాయం జరిగిందని.. ఆ పగతోనే బత్తిన అప్పలరాజు అనే నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. గురువారం తెల్లవారుజామున 6 గంటల సమయంలో పాలు తీసేందుకు లేచిన అప్పలరాజు.. రమణ ఇంటికి కుటుంబసభ్యులు వచ్చినట్లు గుర్తించాడు. తనవద్ద ఉన్న కత్తితో అక్కడకు వెళ్లాడు. ఆ సమయంలో బయట అరుగు శుభ్రం చేస్తున్న రమణ కోడలు ఉషారాణిపై (30) దాడి చేశాడు. మెడ మీద నరకడంతో సగం వరకు తెగి.. ఆమె అక్కడే కుప్పకూలింది. దాడి విషయాన్ని గుర్తించిన విజయ్‌కిరణ్‌ తండ్రి రమణ, అత్త అల్లు రమాదేవి (53) మరుగుదొడ్డిలోకి వెళ్లి దాక్కునే ప్రయత్నం చేయగా.. నిందితుడు తలుపు తోసుకువెళ్లి వారిని అక్కడే నరికాడు. అనంతరం మరో గదిలో నిద్రిస్తున్న విజయ్‌కిరణ్‌ చిన్నత్త నక్కెట్ల అరుణను (37), చిన్న కుమారుడు బమ్మిడి ఉదయ్‌ని (4) బలి తీసుకున్నాడు. కిరణ్‌ కుమార్తె లిషితపైనా (6 నెలలు) దాడి చేయడంతో అక్కడికక్కడే మృతిచెందింది. రక్తపు మరకలతో బయటకొచ్చిన అప్పలరాజు వారిని చంపేశానంటూ వీధిలోకొచ్చి కాసేపు కూర్చుని.. తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చి స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటన జరిగినప్పుడు విజయ్‌కిరణ్‌ విజయవాడలో ఉన్నారు. వీరి ఏడేళ్ల పెద్ద కొడుకు అఖీరనందన్‌ బుధవారం రాత్రి బంధువుల ఇంటివద్ద ఉన్నాడు. దీంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు.

కసితో.. విచక్షణరహితంగా..
ఇంట్లో మృతదేహాలు పడిన తీరు, నిందితుడు నరికిన విధానం చూస్తే హంతకుడు కసితో రగిలిపోతున్నట్లు కనిపించిందని పోలీసులు భావిస్తున్నారు. రమణ శరీర భాగాలు తెగిపడేలా నరికాడు. మరుగుదొడ్డిలో పడి ఉన్న అతని మృతదేహాన్ని బయటకు తీసేటప్పుడు శరీర భాగాలు విడిపోయాయి. మరో గదిలో నిద్రిస్తున్న అరుణను చంపి కడుపును చీల్చాడు. అక్కడే నిద్రిస్తున్న నాలుగేళ్ల ఉదయ్‌ను పడుకోబెట్టి మెడ మీద నరికాడు. హాల్లో నిద్రిస్తున్న ఆరు నెలల చిన్నారి ముఖం మీద కత్తితో దాడి చేశాడు. అందరూ చనిపోయారని నిర్ధారించుకున్నాకే బయటకు వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు.

పగకు కారణమిదీ...
బమ్మిడి రమణ, అప్పలరాజు కుటుంబాల మధ్య గతంలో ఉన్న వివాదాలే ఈ హత్యలకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి...
* అప్పలరాజు కుమార్తెపై రమణ కుమారుడు విజయ్‌కిరణ్‌ అత్యాచారానికి పాల్పడినట్లు 2018 ఏప్రిల్‌లో కేసు నమోదయింది. ఆమెను ఇంటికి పిలిపించి శీతలపానీయాలు, టీ, కాఫీల్లో మత్తుమందు కలిపి ఆమె మత్తులోకి వెళ్లాక పలుమార్లు లైంగికంగా వేధించాడని, ఇలా 8 నెలల పాటు వేధించాడని అందులో పేర్కొన్నారు. ఆమె అసభ్యకరంగా ఉన్న చిత్రాలను చూపించి విజయ్‌కిరణ్‌ భార్య ఉషారాణి డబ్బులు డిమాండు చేశారని, మరో నలుగురు బెదిరించి డబ్బులు డిమాండు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో పెందుర్తి పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేశారు. తన కుమార్తెకు అన్యాయం జరిగిందన్న కోపంతోనే అప్పలరాజు పగ పెంచుకున్నట్లు పోలీసులు చెప్పారు.
*  గతంలో విజయ్‌కిరణ్‌పై కేసు నమోదైన  మర్నాడే.. అతని భార్య ఉషారాణి స్టేషన్‌కు వెళ్లారు. బత్తిన అప్పలరాజు, శ్రీను, గౌరీష్‌, సన్యాసి అనేవారు తమను అసభ్యకరంగా తిడుతున్నారని, తన భర్త విజయ్‌కిరణ్‌ను చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ పెందుర్తి స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు.ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు