close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
భద్రాద్రిలో నిరాడంబరంగా శ్రీరామనవమి ఉత్సవాలు

రెండు రోజులు దర్శనాల నిలిపివేత

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాద్రి రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను గతేడాదిలాగే ఈ సారి కూడా నిరాడంబరంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల  21న శ్రీరామనవమి సందర్భంగా కల్యాణం, 22న పట్టాభిషేకం వేడుకలకు భక్తులకు ప్రవేశం లేదు. లాక్‌డౌన్‌ లేకపోవడంతో ఈసారి ప్రధాన ఆలయంలోని మూలవిరాట్‌ దర్శనాలు యథాతథంగా ఉంటాయని ఇటీవల ప్రకటించారు. అయితే, తాజాగా వచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఆ రెండురోజులు ప్రధాన ఉత్సవంతోపాటు ప్రధాన ఆలయంలో ఎలాంటి దర్శనాలు ఉండవని ఈవో శివాజీ గురువారం వెల్లడించారు. భక్తులు ఇళ్ల నుంచే టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా కల్యాణోత్సవాన్ని వీక్షించాలని సూచించారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు