close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఓటర్లు, సిబ్బందికీ మాస్క్‌ తప్పనిసరి

కరోనా బాధితులు సాయంత్రం 6 తరువాత ఓటేయవచ్చు
ముఖ్యఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌

ఈనాడు, హైదరాబాద్‌: నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో ఓటు వేసేందుకు వచ్చేవారు విధిగా మాస్క్‌ ధరించి రావాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్‌ శశాంక్‌ గోయల్‌ స్పష్టంచేశారు. పోలింగ్‌ సిబ్బందీ మాస్క్‌ ధరించాలని ఆదేశించారు. శనివారం నాటి పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. కరోనా బాధితులు సాయంత్రం 6 గంటల తరువాత ఓటు హక్కు వినియోగించుకోవచ్చన్నారు. పోలింగ్‌ నేపథ్యంలో శనివారం నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలకు ఇప్పటికే సెలవు ప్రకటించామన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌, శానిటైజర్లు ఏర్పాటు చేస్తున్నాం. నియోజకవర్గంలో నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న రూ.45 లక్షల నగదు, రూ.46 లక్షల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నాం. నిబంధనలు అతిక్రమించిన 362 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాం. నాగార్జునసాగర్‌లో ఓటు హక్కు లేని బయటి ప్రాంత వ్యక్తులు అక్కడ ఉండకూడదని పోలీసు అధికారులు ఇప్పటికే ఉత్తర్వులు జారీచేశారు’’ అని శశాంక్‌ గోయల్‌ చెప్పారు.



ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు