close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కేంద్రంపై మరో స్వాతంత్య్ర పోరాటం

లేకపోతే స్టీల్‌ప్లాంట్‌ నిలవదు.. వ్యవసాయ చట్టాలూ ఆగవు
విశాఖ ‘రైతు, కార్మిక శంఖారావం’లో జాతీయ రైతు నేతల పిలుపు

ఈనాడు - విశాఖపట్నం: బ్రిటిష్‌ వారిపై జరిగింది తొలి స్వాతంత్య్ర సంగ్రామమైతే.. ఇప్పుడు భాజపా ప్రభుత్వం మీద రెండో స్వాతంత్య్ర సమరం మొదలుపెట్టాలని జాతీయ రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు. విశాఖలో ఆదివారం విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి, రాష్ట్ర రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ‘రైతు, కార్మిక శంఖారావం’ నిర్వహించారు. జాతీయ స్థాయి రైతు నేతలు రాకేశ్‌ సింగ్‌ టికాయత్‌, అశోక్‌ ధావలె, బి.వెంకట్‌, బల్‌కరణ్‌ సింగ్‌, ధన్‌పాల్‌సింగ్‌ తదితరులు ఉక్కు ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్తామని ప్రతినబూనారు. వీరంతా ఆదివారం ఉదయం మీడియాతోనూ, సాయంత్రం ఆర్కే బీచ్‌లో నిర్వహించిన బహిరంగ సభలోనూ మాట్లాడారు. సమైక్య పోరాటానికి ప్రజలంతా సిద్ధంగా ఉండాలని, అప్రజాస్వామిక విధానాలు తెస్తున్న మోదీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సాయంత్రం బీచ్‌రోడ్డులోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి నివాళులర్పించి ర్యాలీగా బహిరంగ సభకు వచ్చారు.

ఉద్యమం దేశవ్యాప్తం
సభలో భారతీయ కిసాన్‌ యూనియన్‌ జాతీయ నాయకులు రాకేశ్‌ సింగ్‌ టికాయత్‌ మాట్లాడుతూ.. దిల్లీ చుట్టుపక్కలే ఉన్న రైతు ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేసేందుకు కొత్త ఫ్రంట్‌లను ఏర్పాటు చేస్తున్నామని, విశాఖ ఉక్కు గురించీ పోరాడతామని ప్రకటించారు. అదానీ పోర్టు విశాఖకు దగ్గరలోనే ఉందని, అందుకోసం స్టీల్‌ప్లాంట్‌ను కొనేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
రూ.1300 కోట్లకు అమ్మాలనుకుంటున్నారు
సంయుక్త కిసాన్‌ మోర్చా, ఆలిండియా కిసాన్‌ సభ, కిసాన్‌ సంఘ్‌ నుంచి పెద్ద నేతలంతా విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలిపేందుకే వచ్చామని ఆలిండియా కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) అధ్యక్షులు అశోక్‌ ధావలె అన్నారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఆపేవరకూ ఏ ఒక్కరూ వెనక్కి వెళ్లొద్దని కోరారు. రూ.3 లక్షల కోట్ల విలువచేసే స్టీల్‌ప్లాంట్‌ ఆస్తుల్ని రూ.1300 కోట్లకు అమ్మాలని మోదీ ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. ఈ ప్రయత్నాన్ని ఆపడంతో పాటు వ్యవసాయ చట్టాల రద్దు, మద్దతు ధరకు న్యాయపరమైన గ్యారంటీ, విద్యుత్‌, కాలుష్య బిల్లులు రద్దు చేసేదాకా పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. నాలుగు కార్మిక కోడ్‌లను రద్దు చేయాలని విశాఖ నుంచి నినదిస్తున్నామన్నారు. ఏప్రిల్‌ 1 నుంచి ఎరువుల ధరల్ని 50% పెంచారని గుర్తుచేశారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు