close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
లంచం తీసుకుంటూ పట్టుబడితే 100 రోజుల్లో క్రమశిక్షణ చర్యలు

ఉద్యోగులపై చర్యలకు కాలపరిమితి
ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

ఈనాడు, అమరావతి: లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ కేసుల్లో ప్రభుత్వోద్యోగులపై 100 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. నిర్దేశిత కాలపరిమితిలోగా వాటిని అమలు చేయటంలో విఫలమైతే...ఆ జాప్యానికి సంబంధిత శాఖాధికారులు, ఏసీబీ అధికారుల్ని బాధ్యుల్ని చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ తరహా కేసుల్లో బాధ్యులైన ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి నిర్దేశిత కాలపరిమితి లేకపోవటంతో అంతులేని జాప్యం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. దాన్ని అధిగమించేందుకు అవసరమైన సిఫార్సులు చేయడానికి భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌, గ్రామ, వార్డు సచివాలయాల ముఖ్య కార్యదర్శి, పురపాలక, పంచాయతీరాజ్‌, సాధారణ పరిపాలన (సర్వీసెస్‌ విభాగం) శాఖల కార్యదర్శులు, ఏసీబీ డీజీ సభ్యులుగా ఒక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. వారి సిఫార్సుల మేరకు 100 రోజుల కాలవ్యవధిని నిర్దేశించామని ఉత్తర్వుల్లో వివరించారు. లంచం తీసుకుంటూ ఉద్యోగి పట్టుబడ్డప్పటి నుంచి ఎన్ని రోజుల్లో ఏయే చర్యలు చేపట్టాలనేది ఆ వంద రోజుల ప్రణాళికలో పేర్కొన్నామన్నారు.
పెండింగ్‌లో 476 కేసులు
‘1995 నుంచి 2020 వరకూ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డవారికి సంబంధించి మొత్తం 476 కేసులు ఏసీబీ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు