close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాలు

తెలంగాణలో రెండు.. ఆంధ్రప్రదేశ్‌లో ఒకటి సిద్ధం

దిల్లీ: కరోనా ఉద్ధృతితో ఆసుపత్రుల్లో మెడికల్‌ ఆక్సిజన్‌కు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోని ప్రజారోగ్య కేంద్రాల్లో 162 ప్రెజర్‌ స్వింగ్‌ అడ్సార్‌ప్షన్‌ (పీఎస్‌ఏ) యూనిట్లను మంజూరు చేసినట్లు కేంద్రం ప్రకటించింది. ఈ యూనిట్ల ద్వారా ఆక్సిజన్‌ ఉత్పత్తవుతుంది. ఫలితంగా మెడికల్‌ ఆక్సిజన్‌ విషయంలో ఆసుపత్రులు స్వయంసమృద్ధి సాధిస్తాయి. ఈ వాయువు సరఫరాకు సంబంధించిన జాతీయ గ్రిడ్‌పై భారం కూడా తగ్గుతుంది. దీనివల్ల మెడికల్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యం 154.19 ఎం.టి. మేర పెరుగుతుందని కేంద్ర వైద్యశాఖ పేర్కొంది. దేశంలోని 162 పీఎస్‌ఏల్లో 33 ప్లాంట్ల ఏర్పాటు ఇప్పటికే పూర్తయింది. వీటిలో తెలంగాణలో రెండు, ఆంధ్రప్రదేశ్‌లో ఒకటి ఉన్నాయి. మరో 59 పీఎస్‌ఏ ప్లాంట్లు ఏప్రిల్‌ చివరినాటికి సిద్ధమవుతాయి. మిగతా కేంద్రాలను మే నెల చివరికి సిద్ధం చేస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. మరో 100కు పైగా యూనిట్లను రాష్ట్రాలు కోరాయని, వాటినీ మంజూరు చేస్తామని పేర్కొంది.

తెలుగు రాష్ట్రాలకు 360 టన్నుల చొప్పున కేటాయింపు

ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో దానికి 360 టన్నుల చొప్పున ఆక్సిజన్‌ కేటాయించింది. దేశంలో అత్యధిక కొవిడ్‌ కేసులున్న రాష్ట్రాలకు ఆక్సిజన్‌ కేటాయిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. రైళ్ల ద్వారా సరఫరా చేసే ద్రవీకృత మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరా కోసం విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు