close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కొవిడ్‌ క్రియాశీల కేసులు 39 వేలకు పైనే

మొదటి దశ గరిష్ఠాన్ని అధిగమించిన రెండో దశ
కొత్తగా 4,009 కేసులు.. 14 మరణాలు

ఈనాడు- హైదరాబాద్‌: రాష్ట్రంలో కొవిడ్‌ రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. ప్రస్తుతం 39,154 మంది కరోనా బాధితులు ఆసుపత్రులు, ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. గతేడాది సెప్టెంబరు 1న చికిత్స పొందుతున్న వారి సంఖ్య అత్యధికంగా 32,341 ఉండగా.. ఇప్పుడు అంతకంటే దాదాపు 7 వేల మంది  ఎక్కువగా నమోదవడం గమనార్హం. మరోవైపు రాష్ట్రంలో కొత్తగా 4,009 కొవిడ్‌ కేసులు (మొత్తం 3,55,433) నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి మరో 14 మరణాలు (మొత్తం 1,838) సంభవించాయి. ఈ నెల 18న(ఆదివారం) రాత్రి 8 గంటల వరకూ నమోదైన కొవిడ్‌ సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు మంగళవారం విడుదల చేశారు. తాజాగా 1,878 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకూ 3,14,441 మంది ఆరోగ్యవంతులయ్యారు. మొత్తం పాజిటివ్‌ల్లో కోలుకున్నవారి శాతం రాష్ట్రంలో 88.46 కాగా, జాతీయస్థాయిలో 86 శాతంగా ఉంది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 83,089 నమూనాలను పరీక్షించగా, మొత్తంగా పరీక్షల సంఖ్య 1,18,20,842కు పెరిగింది. మరో 5,104 నమూనాల ఫలితాలు వెల్లడవ్వాల్సి ఉంది. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 705, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 363, నిజామాబాద్‌ 360, రంగారెడ్డి 336, సంగారెడ్డి 264, జగిత్యాల 175, వరంగల్‌ నగర 146, కరీంనగర్‌ 135, మహబూబ్‌నగర్‌ 129, సిద్దిపేట 125, కామారెడ్డి 115, ఖమ్మం 113, మంచిర్యాలలో 111 కొత్త పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. మిగిలిన జిల్లాల్లో 100 కంటే తక్కువ సంఖ్యలో కొత్త కేసులు నమోదయ్యాయి.


ఏపీలో ఒక్కరోజులో 27 మరణాలు.. 5,963 కేసులు

ఈనాడు, అమరావతి: ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. క్రితం రోజు(6,582 కేసులు... 22 మరణాలు)తో పోలిస్తే కేసులు కాస్త తగ్గినా మరణాలు పెరిగాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 మధ్య 37,765 నమూనాలు పరీక్షించగా 5,963 (15.7%) మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. చికిత్స పొందుతున్న వారిలో 27 మంది చనిపోయారు. కృష్ణా జిల్లాలో అత్యధికంగా ఆరుగురు మరణించారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో నలుగురేసి, గుంటూరు, కడప, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరేసి, అనంతపురం జిల్లాలో ఒకరు చనిపోయారు. అక్టోబరు 21 తర్వాత ఈ స్థాయిలో
మరణాలు నమోదుకావడం ఇదే ప్రథమం. రాష్ట్రంలో మొత్తం 7,437 మంది మరణించారు.  

* కర్ణాటకలో సోమవారం కరోనాతో 146 మంది మృతి చెందారు. కొత్తగా 15,785 కేసులు నమోదయ్యాయి. 

*  తమిళనాడులో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 10,941 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. 

*  పుదుచ్చేరిలో మంగళవారం నుంచి రాత్రివేళ కర్ఫ్యూ విధించినట్లు ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళి


ఏపీ సచివాలయంలో ఇద్దరు ఉద్యోగుల మృతి

ఈనాడు, అమరావతి: ఏపీ రాష్ట్ర సచివాలయంలో కరోనా బారిన పడి సోమవారం ఇద్దరు ఉద్యోగులు చనిపోయారు. పంచాయతీరాజ్‌శాఖ సెక్షన్‌ ఆఫీసర్‌ వి.శాంతికుమారి (50), హోంశాఖ రికార్డు అసిస్టెంట్‌ ఏఎస్‌ఎన్‌ మూర్తి (45) చనిపోయారు.
ఇద్దరు హైకోర్టు సిబ్బంది..: కరోనా సోకి ఏపీ హైకోర్టు సిబ్బంది ఇద్దరు కన్నుమూశారు. న్యూఫైలింగ్‌ సెక్షన్‌ రికార్డు అసిస్టెంట్‌ పి.శ్రీలత (43), ఏపీ న్యాయసేవాధికార సంస్థ అసిస్టెంట్‌ సుబ్రమణ్యం (56) ఆదివారం మృతి చెందారు. ఆ ఇద్దరి మరణాలతో పాటు పలువురు వ్యాధి బారిన పడుతున్న నేపథ్యంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి ఆధ్వర్యంలో హైకోర్టు న్యాయమూర్తులు (ఫుల్‌కోర్టు) సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు.



ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు