మరణాలు అనూహ్యంగా పెరగలేదు
close

ప్రధానాంశాలు

మరణాలు అనూహ్యంగా పెరగలేదు

వెంటిలేటర్ల అవసరం తగ్గింది... ఆక్సిజన్‌కు డిమాండు పెరిగింది
ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ

ఈనాడు, దిల్లీ: కరోనా తొలిదశతో పోలిస్తే రెండో దశలో రోగులకు వెంటిలేటర్ల అవసరం తగ్గి ఆక్సిజన్‌ అవసరం పెరిగిందని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ వెల్లడించారు. మరణాల్లో అప్పటికీ, ఇప్పటికీ పెద్దగా తేడా లేదన్నారు. సోమవారం నాడిక్కడ ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విలేకరులతో మాట్లాడారు. కరోనా తొలి, మలి దశల్లో వచ్చిన మార్పులపై దేశంలోని 40 ఆసుపత్రుల నుంచి సేకరించిన రోగుల డేటాను విశ్లేషించినట్లు ఆయన చెప్పారు. ఆ వివరాలు..
40 ఏళ్ల పైబడిన వారే అధికం...
రెండు దశల్లోనూ 70%కిపైగా రోగులు 40 ఏళ్ల పైబడినవారే ఉన్నట్లు బలరాం భార్గవ చెప్పారు. వయోవృద్ధులకు ముప్పు తీవ్రత కొనసాగుతూనే ఉందన్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చేరుతున్న వారిలో ఎక్కువ మందిలో లక్షణాలేమీ కనిపించడంలేదని, కానీ చాలామంది ఊపిరిఆడని సమస్యతోనే ఆసుపత్రులకు వస్తున్నారని తెలిపారు. అందువల్ల ఎక్కువ ఆక్సిజన్‌ అవసరమవుతోందన్నారు. మరణాల్లో అప్పటికీ, ఇప్పటికీ పెద్ద తేడా లేదని, అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే పరిస్థితి ఉందని వివరించారు. దేశంలోని 40 ఆసుపత్రుల్లో చికిత్స పొందిన 8047 మంది రోగుల్లో కనిపించిన లక్షణాలు ఇలా...Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని