close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఎంజీఎంలో మందులు, ఆక్సిజన్‌ కొరత లేదు

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల

వరంగల్‌(ఎంజీఎం ఆసుపత్రి), న్యూస్‌టుడే: వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో కొవిడ్‌ చికిత్సకు మందులు, ఆక్సిజన్‌ కొరత లేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. పేదలు ప్రైవేటుకు పోయి  రూ.లక్షలు వృథా చేసుకోకుండా ధైర్యంగా ఈ ఆసుపత్రిలో చేరి నిపుణులైన వైద్యుల సేవలు పొందాలని ఆయన సూచించారు. ఎంజీఎం ఆసుపత్రిలో రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ల మాయం, ఆర్‌టీపీసీˆఆర్‌ పరీక్షలకు శాంపిల్స్‌ను హైదరాబాద్‌కు పంపించడం వల్ల కొవిడ్‌ రోగులు పడుతున్న ఇబ్బందులపై ఇటీవల ‘ఈనాడు’లో కథనాలు రావటం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం మంత్రి ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించారు. ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగార్జునరెడ్డి, కేఎంసీˆ ప్రిన్సిపల్‌ సంధ్య, ఆర్‌ఎంవో వెంకటరమణ, డీఎంహెచ్‌వో లలితాదేవి, వివిధ వైద్య విభాగాల అధిపతులతో కొవిడ్‌ వైద్యసేవలపై సమీక్ష  నిర్వహించారు. అంతర్గత సమావేశంలో మంత్రి ‘మీరు బాగా పనిచేస్తే పత్రికల్లో వరసగా కథనాలు ఎందుకు వస్తున్నాయ’ని ప్రశ్నించినట్లు తెలిసింది. అనంతరం ఈటల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కొవిడ్‌ రోగుల్లో కేవలం 5 శాతం మందికి మాత్రమే వెంటిలేటర్‌పై చికిత్స అందించాల్సి వస్తోందన్నారు. ఆఖరి దశలో ఎంజీఎంకు వచ్చినవారిలో కొందరు వివిధ అనారోగ్య కారణాలతో మృతిచెందుతున్నారని తెలిపారు. కేసుల సంఖ్య పెరిగితే ఎంజీఎంను కొవిడ్‌ ఆసుపత్రిగా మార్చి మొత్తం 1350 పడకలపై సేవలందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కొవిడ్‌ వైద్యసేవల్లో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో ఉన్నట్లు తెలిపారు. ర్యాపిడ్‌ పరీక్షలతో తక్కువ సమయంలో ఎక్కువ కచ్చితత్వం రిపోర్టులు వస్తున్నాయని, కానీ చాలామంది ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలకే మొగ్గుచూపడం వల్ల ఫలితం రావడానికి ఆలస్యమై, సరైన వైద్యం అందక ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారన్నారు. వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాల ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలను వరంగల్‌ కేఎంసీలోని వైరాలజీ ల్యాబ్‌లోనే చేయాలని కేఎంసీˆ ప్రిన్సిపల్‌కు సూచించినట్లు తెలిపారు.



ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు