close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాహుల్‌ గాంధీకి కరోనా

 సీఈసీ సుశీల్‌ చంద్రకూ పాజిటివ్‌

దిల్లీ, కాఠ్‌మాండూ: కరోనా బారిన పడుతున్న ప్రముఖుల జాబితా నానాటికీ పెరిగిపోతోంది. కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ, భారత ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) సుశీల్‌ చంద్ర, కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌లకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ‘‘స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నా. కరోనా సోకినట్లు తేలింది. ఇటీవల నన్ను కలిసిన వారంతా అన్ని భద్రతా ప్రమాణాలను పాటించండి. సురక్షితంగా ఉండండి’’ అని ట్విటర్‌లో రాహుల్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆనంద్‌ శర్మ కూడా కరోనా బారిన పడ్డారు.   సీఈసీ సుశీల్‌ చంద్రతో పాటు ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌కు వైరస్‌ సోకింది. ప్రస్తుతం వారిద్దరూ ఇంటి నుంచే పని చేస్తున్నారు. దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ భార్య సునీత వైరస్‌ పాజిటివ్‌గా తేలారు.  కేజ్రీవాల్‌  క్వారంటైన్‌లో ఉన్నట్లు దిల్లీ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.
నిలకడగా మన్మోహన్‌ ఆరోగ్యం
కరోనా బారిన పడ్డ మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై దిల్లీ ఎయిమ్స్‌ వైద్య బృందాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ ఆరా తీశారు. మన్మోహన్‌కు మెరుగైన చికిత్స అందుతున్నట్లు చెప్పారు. మాజీ ప్రధాని త్వరగా కోలుకోవాలని ఆధ్యాత్మిక గురువు దలైలామా ఆకాంక్షించారు.
రాహుల్‌ త్వరగా కోలుకోవాలి: మోదీ
కొవిడ్‌ నుంచి రాహుల్‌ గాంధీ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఆయన ఆరోగ్యం బాగుండాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు ట్విటర్‌ వేదికగా తెలిపారు.
నేపాల్‌ మాజీ రాజు జ్ఞానేంద్రకూ..
ఇటీవలే భారత్‌లోని హరిద్వార్‌లో మహా కుంభమేళాలో పాల్గొని స్వదేశానికి వెళ్లిన నేపాల్‌ మాజీ రాజు జ్ఞానేంద్ర షా, మాజీ రాణి కోమల్‌ షాలకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.



ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు