close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నిలకడగా సీఎం ఆరోగ్యం

  ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలోనూ పాజిటివ్‌
  పరామర్శించిన కేటీఆర్‌, కవిత, సంతోష్‌

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా బారిన పడిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో హోం ఐసొలేషన్‌లో ఉన్న ఆయనకు వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు నేతృత్వంలోని వైద్యుల బృందం చికిత్స అందిస్తోంది. మంగళవారం రాష్ట్ర మంత్రి కేటీ రామారావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌లు ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఫోన్‌లో పరామర్శించిన పోచారం, గుత్తా
రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డిలు మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఫోన్‌లో పరామర్శించారు. సీఎం త్వరగా కోలుకోవాలని అన్ని ఆలయాల్లో పూజలు చేయాలని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పూజారులను కోరారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌, సినీనటుడు మోహన్‌బాబు తదితరులు సీఎం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.



ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు