close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కబళించిన మహమ్మారి

ఒకే కుటుంబలో నలుగురి మృతి

ఈనాడు, అమరావతి-న్యూస్‌టుడే, విద్యాధరపురం: కరోనా ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. రెండు రోజుల్లో తల్లీతండ్రీ, కుమారుడు, చిన్నాన్న మృతి చెందిన ఘటన విజయవాడ ఒకటో పట్టణంలో చోటుచేసుకుంది. తూనుకుంట్ల దుర్గాప్రసాద్‌(67), తూనుకుంట్ల కృష్ణ(64) సోదరులు. సమ్మెటవారి వీధిలో పక్కపక్కనే నివాసం ఉంటున్నారు. దుర్గాప్రసాద్‌ మెడికల్‌, ఫ్యాన్సీ దుకాణం నిర్వహిస్తుండగా... కృష్ణ వస్త్ర వ్యాపారం చేస్తుంటారు. పది రోజుల క్రితం దుర్గాప్రసాద్‌ భార్య పద్మావతి (63)కి కరోనా సోకగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. తర్వాత కృష్ణకూ వైరస్‌ సోకింది. మరో రెండు రోజులకు దుర్గాప్రసాద్‌ కూడా కరోనాతో ఆసుపత్రిలో చేరారు. ఈ ముగ్గురికీ చికిత్స అందిస్తుండగా ఆదివారం అర్ధరాత్రి గంట వ్యవధిలో పద్మావతి, కృష్ణ చనిపోయారు. వారి మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహించాక దుర్గాప్రసాద్‌ కుమారుడు న్యాయవాది అయిన దినేష్‌(37)కు వైరస్‌ సోకినట్లు తేలింది. ఆయనా అదే ఆసుపత్రిలో చేరారు. మంగళవారం ఉదయం దుర్గాప్రసాద్‌ కన్నుమూశారు. దీంతో ఆసుపత్రిలో వైద్యం సరిగా అందడం లేదని దినేష్‌ను బంధువులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన మధ్యాహ్న సమయంలో చనిపోయారు. దినేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు.. కృష్ణకు భార్య, కుమారుడు ఉన్నారు. ఈ రెండు కుటుంబాలకు చెందిన వారంతా ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు